Bigg Boss 9 Telugu: గత రెండు వారాల నుండి బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో పడాల పవన్ కళ్యాణ్ తన ఆట తీరుని ఎలా మార్చుకున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మూడవ వారం డేంజర్ జోన్ లోకి రావడం పవన్ కళ్యాణ్ ని చాలా అలెర్ట్ అయ్యేలా చేసింది. ఇక అప్పటి నుండి ఆయన చిరుత పులి లాగా ఆటల్లో తన సత్తా చూపిస్తూ ముందుకు దూసుకుపోయాడు. క్రిందకి పడిపోవడం, పైకి లేవడం, పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ జర్నీ మొత్తం ఇలాగే ఉంది. మూడవ వారం ఇమ్మానుయేల్ తో కలిసి ఒక రేంజ్ లో ఆటలు ఆడి తన సత్తా చాటిన పవన్ కళ్యాణ్, ఈ వారం ఆరంభం లో కొన్ని టాస్కులు ఆడడం లో తడబడ్డాడు. వరుసగా రెండు రౌండ్స్ ఓడిపోవడం తో వరస్ట్ కంటెస్టెంట్ అనే బిరుదు కూడా తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన మూడు టాస్కుల్లో వరుసగా విజయాలు సాధించి నామినేషన్స్ నుండి సేవ్ అయ్యాడు.
ఇక చివర్లో నిర్వహించిన కెప్టెన్సీ టాస్క్ లో కూడా విజయం సాధించి, హౌస్ కి కొత్త కెప్టెన్ గా మారాడు. అయితే శనివారం ఎపిసోడ్ కి సంబంధించి కొన్ని లీక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అందులో ఒక లీక్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ తనూజ ని మోసం చేసి కెప్టెన్ అయ్యాడు అట. ఎలా మోసం చేసాడు అనేది నాగార్జున తనూజ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి, వీడియో చూపించాడట. తనూజ దానిని చూసి షాక్ కి గురి అయ్యినట్టు సమాచారం. తానూ చూసిన ఆ వీడియో గురించి బయటకు వెళ్లిన తర్వాత అసలు చర్చించవద్దని నాగార్జున తనూజ తో అన్నాడట. ఈ వీడియో పెద్ద వివాదాలకు దారి తీసే విధంగా, ఈ బిగ్ బాస్ సీజన్ కి గేమ్ చేంజర్ గా నిలవబోతుందని టాక్.
ఇమ్మానుయేల్, దివ్య మొదటి నుండి కళ్యాణ్ ని సేవ్ చేయడం పై తనూజ ని తప్పుబడుతూనే ఉన్నారు. ఈ విషయం నేరుగా తనూజ వద్దకు వచ్చి వాళ్లిద్దరూ చెప్తారు కూడా. కానీ తనూజ మాత్రం అందుకు ఒప్పుకోదు, కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది. ఎన్ని సార్లు కళ్యాణ్ గురించి తప్పుగా చెప్పినా ఆమె పట్టించుకోదు, బిగ్ బాస్ సెల్ఫిష్ గా ఆడమని కంటెస్టెంట్స్ కి చెప్పారు, సుమన్ అన్న, కళ్యాణ్ అని రెండు ఛాయస్ లు ఉన్నప్పుడు, నేను కళ్యాణ్ ని ఎంచుకున్నాను, అది నా స్వార్థం కదా?, అలాంటప్పుడు కళ్యాణ్ స్వార్థం గా ఆలోచిస్తే తప్పేంటి అని ఇమ్మానుయేల్ తో వాదించింది. ఇంతలా కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడిన తనూజ కి, ఇప్పుడు ఆ కళ్యాణే వెన్నుపోటు పొడిచాడు అనే విషయం తెలిస్తే అసలు తట్టుకోగలదా?, అసలు ఏమి జరగబోతుంది అనేది నేటి ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలి