Bigg Boss 9 Telugu: ఈ వారం బిగ్ బాస్(Biggest Boss 9 Telugu) హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి ఏకంగా పది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ వారం వైల్డ్ కార్డ్స్ హౌస్ లోపలకు అడుగుపెట్టబోతున్నారు కాబట్టి, కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉందని టాక్. ఈ వారం ఇమ్మ్యూనిటీ టాస్కులు నిర్వహించి నామినేషన్స్ లో ఉన్నటువంటి తనూజ,భరణి, దివ్య మరియు పవన్ కళ్యాణ్ లను బిగ్ బాస్ సేవ్ చేసాడు. ఇక నామినేషన్స్ లో మిగిలింది కేవలం ఫ్లోరా షైనీ, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, సంజన, శ్రీజ దమ్ము, డిమోన్ పవన్ లు మిగిలారు. వీరిలో అందరి కంటే అత్యధిక ఓట్లతో సంజన కొనసాగితే, రెండవ స్థానం లో సుమన్ శెట్టి కొనసాగాడట. ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో శ్రీజ, నాల్గవ స్థానం లో డిమోన్ నిలిచారట.
ఇక చివరి రెండు స్థానాల్లో ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి నిలిచారట. ఫ్లోరా కంటే రీతూ కి తక్కువ ఓట్లు పడినట్టు సమాచారం. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే హోస్ట్ నాగార్జున రీతూ, సంజన, ఫ్లోరా చేతుల్లో హోస్ట్ నాగార్జున ఏవిక్షన్ బోర్డు పెట్టాడట. ఈరోజు ఎపిసోడ్ లో ఒక టాస్క్ ని నిర్వహించడం, ఈ టాస్క్ లో ఇమ్మానుయేల్ గెలవడం తో అతని చేతుల్లోకి పవర్ అస్త్రా వస్తుంది. దీనిని ఉపయోగించి ఏవిక్షన్ బోర్డులు ఉన్న ముగ్గుర్లో ఒకరిని సేవ్ చేయమని అంటాడట నాగార్జున. అప్పుడు ఇమ్మానుయేల్ ఎవరిని సేవ్ చేస్తాడు అనే దానిపైనే ఎలిమినేషన్ ఆధారపడి ఉంటుందట. ఇమ్మానుయేల్ కి సంజన మరియు రీతూ చౌదరి ఇద్దరు కూడా బాగా క్లోజ్. సంజన ఎలాగో సేవ్ అవుతుంది అనే నమ్మకం ఉంటుంది కాబట్టి, ఆ పవర్ అస్త్రా ని తన స్నేహితురాలైన రీతూ కోసం ఉపయోగిస్తాడా?.
లేదంటే రిస్క్ చేయకుండా అమ్మా అని పిలిచే సంజన కోసమే ఉపయోగిస్తాడా?, ఒకవేళ సంజన కోసమే ఉపయోగిస్తే మాత్రం, నూటికి నూరు శాతం రీతూ చౌదరి ఎలిమినేట్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఇమ్మానుయేల్ ఏవిక్షన్ బోర్డు ఉన్నటువంటి ఈ ముగ్గురికి ఉపయోగించకుండా, భవిష్యత్తులో ఉపయోగిస్తాను అని దాచిపెట్టుకుంటే మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈ డబుల్ ఎలిమినేషన్ లో కచ్చితంగా ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రీతూ చౌదరి ఎలిమినేట్ అవ్వడం న్యాయం కాదు. ఎక్కువగా పులిహోర పంచాయితీలు ఉంటాయి కానీ, టాస్కులు వచ్చినప్పుడు మాత్రం మగవాళ్ళతో సమానంగా పోటీ పడి ఆడుతుంది. టాస్క్ వస్తే అసలు తానూ అమ్మాయి అనే విషయమే మర్చిపోతుంది రీతూ. అందుకే ఇలాంటి కంటెస్టెంట్స్ హౌస్ లో ఉంటేనే మజా ఉంటుంది కాబట్టి, బిగ్ బాస్ యాజమాన్యం ఈ విధంగా గేమ్ ని నేడు డిజైన్ చేసారని అంటున్నారు, చూడాలి మరి రీతూ సేవ్ అవుతుందా లేదా అనేది.