Bigg Boss 8 Telugu: నటుడు అభయ్ నవీన్ లేటెస్ట్ సీజన్లో కంటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అభయ్ నవీన్ అనేక సినిమాలు, సిరీస్లలో నటించాడు. ఆడియన్స్ లో మనోడికి ఫేమ్ ఉంది. అయితే హౌస్లో పెద్దగా సత్తా చాటలేదు. అభయ్ నవీన్ గేమ్ పట్ల ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకసారి చీఫ్ అయితే అయ్యాడు. కాగా బిగ్ బాస్ పై అభయ్ నవీన్ ఆరోపణలు చేయడం సంచలనమైంది. బిగ్ బాస్ పక్షపాతంగా ఉంటున్నాడు. కొందరికి ఫేవర్ చేస్తున్నాడని అన్నాడు. కొన్ని అనుచిత కామెంట్స్ సైతం చేశాడు.
ఈ క్రమంలో నాగార్జున క్లాస్ పీకాడు. అభయ్ నవీన్ క్షమాపణలు చెప్పాడు. మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. మరో మూడు వారాల్లో బిగ్ బాస్ తెలుగు 8 ముగియనుంది. విన్నర్ ఎవరు కావచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. దాంతో అభయ్ నవీన్ తన అభిప్రాయం వెల్లడించాడు. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నేను, నిఖిల్ బెలూన్ టాస్క్ ఆడుతున్నప్పుడు.. నిఖిల్ చేతిలో ఉన్న స్టిక్ విరిగిపోయింది. నేను ఫైట్ చేస్తుంటే.. నిఖిల్ చేతిలో స్టిక్ లేదు. కాబట్టి ఇది అధర్మం. నిఖిల్ వద్ద స్టిక్ లేదు కాబట్టి ఆడకూడదు అన్నారు.
మరి అదే అధర్మం అయినప్పుడు.. మధ్యలో వచ్చినోడికి టైటిల్ ఎలా ఇస్తారు. ఫస్ట్ హౌస్లోకి వెళ్లి, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, జనాల్లో నెగిటివిటీ ఉందో పాజిటివిటీ ఉందో తెలియకుండా, తమ గేమ్ తాము ఆడుతున్న వాళ్లకు టైటిల్ ఇవ్వడం కరెక్టా? లేక మధ్య వెళ్లి, వాళ్ళ స్ట్రెంగ్త్, వీక్నెస్ తెలుసుకుని తెలివిగా ఆడేవారికి టైటిల్ ఇవ్వడం కరెక్టా? నా దృష్టిలో ఫస్ట్ నుంచి ఉన్నోళ్లకే టైటిల్ గెలిచే అర్హత ఉంది.. ఇది నా పర్సనల్ ఒపీనియన్… అని అభయ్ అన్నాడు.
నిఖిల్, గౌతమ్ లలో ఒకరు టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. కొందరు గౌతమ్ టైటిల్ విన్నర్ అంటుంటే మరికొందరు నిఖిల్ అంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్లకు టైటిల్ ఇవ్వడం సమంజసం కాదని అభయ్ అభిప్రాయ పడ్డారు. అభయ్ కామెంట్స్ ని కొందరు సమర్దిస్తుంటే కొందరు వ్యతిరేకిస్తున్నారు. అలాంటప్పుడు అసలు వైల్డ్ కార్డ్ కాన్సెప్ట్ ఎందుకు? తీసేయండి, అంటున్నారు.