Devisree Prasad : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ ఇప్పుడు చిన్న కాంట్రవర్సీ లో చిక్కుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా నిర్మాతలపై తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నాడని, అల్లు అర్జున్ పట్ల కూడా ఆయన సంతోషంగా లేడని నిన్న చెన్నై లో జరిగిన ‘వైల్డ్ ఫైర్’ ఈవెంట్ ద్వారా అందరికీ అర్థమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘పుష్ప 2’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈయన అందించిన మూడు పాటలు విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయం లో మాత్రం అటు నిర్మాతలు, ఇటు డైరెక్టర్ సుకుమార్ ఎవ్వరూ కూడా సంతృప్తి చెందలేదు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ దేవి శ్రీ ప్రసాద్ ని సినిమా నుండి తప్పించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ ని తీసుకున్నారు.
ఈ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ మనసు చాలా నొచ్చుకుందని నిన్న ఈవెంట్ లో అర్థమైంది. స్టేజి మీద నుండే నిర్మాత గురించి మాట్లాడుతూ ‘టైం కి పాటలు ఇవ్వలేదని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేదని అంటున్నారు. నా మీద మీకు ప్రేమ ఎక్కువ అని తెలుసు. ప్రేమ ఉన్న చోటనే కంప్లైంట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రేమ కంటే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈవెంట్ కి ఆలస్యంగా వచ్చానని నా మీద అరుస్తున్నారు. ఇలాంటి ఈవెంట్స్ కి రావడానికి నాకు సిగ్గు. నన్నేమి చేయమంటారు చెప్పండి. ఇవన్నీ మిమ్మల్ని ప్రైవేట్ గా కూడా అడగొచ్చు. కానీ అలా అడిగితే కిక్ ఉండదు. అందుకే ఇలా అడిగేస్తున్నాను ఏమనుకోకండి’ అని అంటాడు దేవిశ్రీప్రసాద్. అదే విధంగా అభిమానులతో కూడా మాట్లాడుతూ ‘ఎప్పుడు తీసుకోవాల్సింది అప్పుడే తీసేసుకోవాలి..లేకపోతే ఈమధ్య పని ఇవ్వట్లేదు. రెమ్యూనరేషన్ విషయంలో అయినా, క్రెడిట్స్ విషయం లో అయినా..ఏమంటారు బన్నీ గారు?..సరే సరే ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం’ అని అంటాడు దేవి శ్రీ ప్రసాద్.
Something is Fishy #DeviSriPrasad #Pushpa2TheRule pic.twitter.com/QctnPtTIAR
— NEWS3PEOPLE (@news3people) November 24, 2024
ఇలా ఒక పబ్లిక్ స్టేజి మీద వేలాది మంది అభిమానుల సమక్ష్యం లో దేవి శ్రీ ప్రసాద్ ఇంతటి అసంతృప్తిని వ్యక్తపరిచాడంటే, ఆయన మనసు ఎంత గాయపడిందో అర్థం చేసుకోవచ్చు. దేవి శ్రీ ప్రసాద్ కి ఇలా చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, లెజెండ్ మూవీ సక్సెస్ మీట్ లో ‘దేవి శ్రీ ప్రసాద్ నుండి మంచి మ్యూజిక్ ని పిండుకున్నాను..రేయింబవళ్లు ఆయన్ని రికార్డింగ్ రూమ్ లో బంధించి ఔట్పుట్ ని రప్పించుకున్నాం’ అంటూ మాట్లాడగా, వెంటనే దేవి శ్రీ ప్రసాద్ బోయపాటి నుండి మైక్ లాక్కొని ధమ్కీ ఇస్తాడు. ఇది అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. మళ్ళీ ఇన్నాళ్లకు దేవి శ్రీ పబ్లిక్ ఈవెంట్ లో అసంతృప్తి ని వ్యక్తపరిచాడు. సినిమా విడుదలకు ముందు ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప 2 పంచాయితీ స్టేజ్ మీద పెట్టేసిన DSP
టైం కి పాట ఇవ్వలేదు
టైం కి బీజీమ్ ఇవ్వలేదు
ఇప్పుడు కూడా లేట్ గా వచ్చా అన్నారు.. (మైత్రి రవి ని )షాక్ లో మైత్రి నవీన్ ఎక్స్ప్రెషన్స్.. #Pushpa2 pic.twitter.com/Bn2f8FiSoE
— M9 NEWS (@M9News_) November 24, 2024