Bigg Boss Telugu 8 : నిన్న గాక మొన్న మొదలైనట్టు అనిపిస్తున్న ఈ సీజన్ బిగ్ బాస్ అప్పుడే క్లైమాక్స్ కి చేరుకుంది. గత వారం యష్మీ ఎలిమినేట్ అవ్వగా హౌస్ లో ఇప్పుడు 9 మంది మిగిలారు. ఈ 9 మందిలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వొచ్చు. నామినేషన్స్ లోకి మెగా చీఫ్ రోహిణి తప్ప హౌస్ మేట్స్ అందరూ వచ్చారు. వీరిలో విష్ణు ప్రియ, అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీ. ఈ నలుగురిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ఓటింగ్స్ ప్రకారం అయితే టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి వీరిలో ఏ ఇద్దరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో చూడాలి. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ టైమింగ్స్ లో పెద్ద మార్పులు వచ్చే వారం నుండి చోటు చేసుకోబోతున్నాయి.
ఇది వరకు ఈ సీజన్ ఎపిసోడ్స్ ప్రతీ రోజు రాత్రి స్టార్ మా ఛానల్ లో రాత్రి 9 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అయ్యేది. కానీ వచ్చే వారం నుండి 10 గంటలకు టెలికాస్ట్ కాబోతుందట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. గతం లో సీజన్ 6 కి ఇలా జరిగింది. మళ్ళీ ఇలాంటి మార్పులు సీజన్ 8 కి జరుగుతుంది. సీజన్ 6 బిగ్ బాస్ హిస్టరీ లోనే ఘోరమైన డిజాస్టర్ గా నిల్చిన సంగతి తెలిసిందే. సీజన్ 8 కూడా అంత పెద్ద డిజాస్టర్ అవ్వడం వల్లే టైమింగ్స్ మార్చారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి సీజన్ 7 లో డైలీ ఎపిసోడ్స్ వచ్చే టీఆర్ఫీ రేటింగ్స్ సీజన్ 8 ఎపిసోడ్స్ లో సగం కూడా రావడం లేదట. బిగ్ బాస్ ఎపిసోడ్స్ కంటే స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘బ్రహ్మముడి’, ‘కార్తీకదీపం’ సీరియల్స్ కి అత్యధిక రేటింగ్స్ వస్తున్నాయట.
సోమవారం నుండి స్టార్ మా ఛానల్ లో సరికొత్త సీరియల్ టెలికాస్ట్ కాబోతున్న ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 టైమింగ్స్ మార్చారు. ఈ సీజన్ ఇంత పెద్ద డిజాస్టర్ అవ్వడానికి ప్రధాన కారణం క్లాన్స్ కాన్సెప్ట్. గత సీజన్స్ లో గ్రూప్ గేమ్స్ ఆడడం పెద్ద క్రైమ్ గా చూసేవాళ్ళు ఆడియన్స్. అలాంటి ఆడియన్స్ కి స్వయంగా బిగ్ బాస్ క్లాన్స్ గా విడిపోయి కొట్టుకొంది అనడమే ఈ సీజన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. పైగా గౌతమ్ లాంటి ప్లేయర్స్ సొంతంగా గేమ్స్ ఆడుతూ, గ్రూప్ గేమ్స్ ఆడే వాళ్ళని తప్పుపడుతుంటే, వాళ్ళని తప్పుపట్టడం కరెక్ట్ కాదు, గ్రూప్ గేమ్స్ ఆడడం కరెక్ట్ అంటూ హోస్ట్ నాగార్జున స్థాయి వాళ్ళు చెప్పడం, ఈ సీజన్ డిజాస్టర్ అవ్వడానికి ఇంకో కారణంగా నిల్చింది. ముఖ్యంగా ఈ సీజన్ నాగార్జున హోస్టింగ్ పై ప్రేక్షకులు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.