https://oktelugu.com/

Tanakpur-Bagheshwar Railway Line:  బ్రిటిష్‌ కాలంలో మొదలైన సర్వే.. ఎట్టకేలకు పూర్తి… నిర్మాణానికి ఎన్నేళ్లో మరి!

ప్రపంచంలో రైల్వే వ్యవస్థలో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. బ్రిటిష్‌ కాలనంలోనే మన దేశంలో రైల్వే లైన్‌ నిర్మాణం జరిగింది. రైళ్లు పట్టాలపై పరిగెత్తాయి. స్వాతంత్రం వచ్చాక.. ఆవిరి ఇంజిన్, విద్యుత్‌ ఇంజిన్లతోపాటు రైల్వే లైన్ల విస్తరణ జరిగింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 27, 2024 / 02:22 PM IST

    Tanakpur-Bagheshwar Railway Line

    Follow us on

    Tanakpur-Bagheshwar Railway Line:  నూతన రైల్వే లైన్ల నిర్మాణానికి ఏ దేశంలో అయినా ముందుగా సర్వే చేస్తారు. అనుకూల మార్గంలోనే నిర్మాణాలు చేపడతారు. భారత దేశంలో రైల్వే లైన్ల విస్తరణ వేగంగా జరుగుతోంది. రవాణా సౌకర్యాలను మెరుగు పర్చేందుకు రైల్వే శాఖ వివిధ మార్గాల్లో నూతన రైల్వే లైన్లు నిర్మిస్తోంది. అయితే ఓ రైల్వే లైన్‌ నిర్మాణానికి చేపట్టిన సర్వే పూర్తి చేయడానికి 112 ఏళ్లు పట్టింది. బ్రిటిష్‌ కాలంలో మొదలైన ఈ సర్వే.. ఎట్టకేలకు పూర్తయింది.

    170 కి.మీ పొడవు..
    ఉత్తరాఖండ్‌లోని తనక్పూర్–భాగేశ్వర్‌ రైలు మార్గానికి సబంధించి 170 కిలోమీటర్ల రైల్వే లైన్‌ నిర్మాణానికి 1882లోనే అడుగులు పడ్డాయి. ఈ రైల్వే లైన్‌ కోసం 1912లో సర్వే జరిగింది. నాటి నుంచి నేటి వరకు మొత్తం ఏడు సర్వేలు జరిగాయి. రెండేళ్లపాటు సాగిన సర్వేలో తుది నివేదికను స్కైలైన్‌ ఇంజినీరింగ్‌ డిజైస్‌ సంస్థ తాజాగా రైల్వే శాఖకు అందజేసింది. 170 కిలోమీటర్ల ఈ రైలు మార్గం నిర్మాణానికి రూ.49 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ రైల్వేలైన్‌ నిర్మాణం జరిగితే నేపాల్, చైనా సరిహద్దు వరకు చేరుకోవడం సులభం అవుతుంది.

    తుది నివేదికలో ఇలా..
    తాజాగా సమర్పించిన తుది నివేదిక ప్రకారం.. తనక్పూర్‌–భాగేశ్వర్‌ మధ్య రైల్వే మార్గ చేపడితే 12 రైల్వే స్టేషన్లు నిర్మించాల్సి ఉంటుంది. ఈ స్టేషన్లు 170 కిలోమీటర్ల రైల్వే మార్గంలోనిర్మించాల్సి ఉంటుంది. అలాగే ఈ లైన్‌ కోసం 452 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీనిలో 27 హెక్టార్ల భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది.

    ప్రాముఖమైన ప్రాజెక్టుగా…
    తనక్పూర్‌–భాగేశ్వర్‌ రైలు మార్గాన్ని 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టుగా పరిగణించింది. అప్పట్లో ఈ రైల్వే లైన్ మార్గంలో 54 కిలోమీటర్ల మేర 72 సొరంగాలను ప్రతిపాదించారు. కాళీ నది ఒడ్డున తనక్పూర్‌ నుంచి పంచేశ్వర్‌ వరకు రైల్వే మార్గం నిర్మించాల్సి ఉంటుంది. అల్మోరా, పితోర్డ్, చంపాత్, భాగేశ్వర్‌ జిల్లాలకు ఈ రైల్వేలైన్‌ నిర్మాణంతో ప్రయోజనం చేకూరుతుంది. పర్వత ప్రాంతాలకు వెళ్లే మార్గం సులభతరం కావడంతోపాటు పర్యాటక రంగానికి ఆదరణ లభిస్తుంది. చైనా, నేపాల్‌ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఈ రైలే మార్గానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది.

    నిర్మాణానికి ఎన్నేళ్లో..
    అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఈ రైల్వే లైన్‌ సర్వేకు 112 ఏళ్లు పట్టింది. మరి నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారు. తుది నివేదికను ఓకే చేసి నిర్మాణం చేపట్టినా పూర్తి చేయడానికి ఎన్నేళ్లు పడుతుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.