https://oktelugu.com/

Shobha Shetty Engagement: సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. శోభాశెట్టి చేసుకునే వరుడు ఇతడే

బిగ్ బాస్ 7 ఫేమ్ శోభాశెట్టి ఎలాంటి హడావిడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. సరిగ్గా ఓ రెండు నెలల క్రితం ఇదే షోలో ప్రియుడిని పరిచయం చేసింది అమ్మడు. ఈ లోపే ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 23, 2024 / 07:07 PM IST
    Follow us on

    Shobha Shetty Engagement: చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో? పెళ్లి వార్త ఎప్పుడు చెప్తారో? ఎవరిని పరిచయం చేస్తారో తెలుసుకోవడం కష్టమే. సడన్ గా ఎంగేజ్మెంట్, పెళ్లి అంటూ ప్రకటిస్తుంటారు. కానీ కొందరిపై ఎప్పటి నుంచో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. కానీ బిగ్ బాస్ ఫేమ్ శోభా మాత్రం సడన్ గా అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో చూసేయండి.

    బిగ్ బాస్ 7 ఫేమ్ శోభాశెట్టి ఎలాంటి హడావిడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. సరిగ్గా ఓ రెండు నెలల క్రితం ఇదే షోలో ప్రియుడిని పరిచయం చేసింది అమ్మడు. ఈ లోపే ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది. అంతేకాదు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనుందట. కన్నడ బ్యూటీ శోభాశెట్టి కార్తీకదీపం సీరియల్ లో మోనిత అనే విలన్ పాత్రతో ఎంతో గుర్తింపు సంపాదించింది. దాదాపు ప్రతి తెలుగింటిలోనూ ఈమెకు అభిమానులు ఉన్నారు. ఆ రేంజ్ లో నటిగా అదరగొట్టేసింది శోభా. అయితే గతేడాది జరిగిన బిగ్ బాస్ 7వ సీజన్ లో పాల్గొని దాదాపు చివరి వరకు వచ్చేసింది.

    శివాజీ అండ్ గ్యాంగ్ కి తన మాటలతో చుక్కలు చూపించింది. దీంతో ఎందరో ఈమెను విమర్శించారు. కానీ శివాజీ లాంటి వాళ్లతో పోలిస్తే శోభా చాలా బాగా ఆడిందని టాక్. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో తన ప్రియుడిని పరిచయం చేసింది ఈ బ్యూటీ. వీరిద్దరు కూడా కార్తీకదీపం సీరియల్ లో కలిసి నటించారు. షార్ట్ ఫిల్మ్స్ లోనూ యాక్ట్ చేశారు. అలా పనిచేస్తూ ప్రేమలో పడ్డారు ఈ జంట. అయితే గత సంవత్సరమే వీరి నిశ్చితార్థం జరగాలి. కానీ క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా శోభాశెట్టి ఇప్పుడు బయటపెట్టింది.

    తాజాగా బెంగళూరులోని శోభాశెట్టి ఇంట్లో నిశ్చితార్థం జరిగింది. యశ్వంత్-శోభా దండలు మార్చుకున్నారు. అయితే ఇది నిశ్చితార్థ వేడుక అని వీడియోలో శోభాశెట్టి ఎక్కడ చెప్పలేదు. తర్వాత వీడియోలో దీని గురించి చేబుతానని దాటవేసింది. త్వరలో పెళ్లి డేట్ కూడా చెప్పేస్తుందేమో..