https://oktelugu.com/

Telangana Activists: తెలంగాణ పోలీస్‌ ఫైల్స్‌.. 1969 రికార్డ్స్‌ కోసం వేట!

తెలంగాణలో కొత్తగా కొలువు దీరి ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు సంఘీభావం తెలిపింది. ఉద్యమకారులను గుర్తించి గౌరవించాలని నిర్ణయించింది. ప్రతీ ఉద్యమకారునికి ఇంటి స్థలం మంజూరు చేయాలని నిర్ణయించింది.

Written By:
  • NARESH
  • , Updated On : January 23, 2024 / 07:02 PM IST
    Follow us on

    Telangana Activists: గుజరాత్‌ ఫైల్, కశ్మీర్‌ ఫైల్స్‌.. కేరళ ఫైల్స్‌.. రాజాకార్‌ ఫైల్స్‌.. కొంతకాలంగా బాగా ఫేమస్‌ అయిన పేర్లు ఇవీ. కశ్మీర్‌ ఫైల్స్‌ మాత్రం సినిమాగా వచ్చింది. రజాకార్‌ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అయితే ఈ ఫైల్స్‌కు తోడు తాజాగా తెలంగాణ పోలీస్‌ ఫైల్స్‌ పదం తెలంగాణలో ఎక్కువగా వినబడుతోంది. ఐదున్న దశాబ్దాల పోలీస్‌ రికార్డ్‌ కోసం తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు.

    ఎందుకంటే..
    తెలంగాణలో కొత్తగా కొలువు దీరి ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు సంఘీభావం తెలిపింది. ఉద్యమకారులను గుర్తించి గౌరవించాలని నిర్ణయించింది. ప్రతీ ఉద్యమకారునికి ఇంటి స్థలం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. ఇటీవల ప్రజాపాలన అభయహస్తం పేరుతో దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయితే ఈ దరఖాస్తుల్లో ఉద్యమకారులపై నమోదైన కేసు నంబర్, ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్‌ జత చేయాలని సూచించింది.

    ఠాణాల చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులు..
    2001 నుంచి జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అరెస్ట్‌ అయ్యారు. జైలుకు వెళ్లారు. వారికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, తెలంగాణ ఉద్యమం 2001లో మొదలు కాలేదు. 1969లోనే తొలి దశ తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలోనూ అనేక మంది జైలుకు వెళ్లారు. ఇన్నాళ్లూ వారు గుర్తింపునకు నోచుకోలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించడంతో 1969లో అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లిన వారు ఇప్పుడు ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు.తమను అరెస్టు చేసినట్టు – కేసు కట్టినట్టు సాక్ష్యం కొరకు నాటి పోలీస్‌ రికార్డులు గాలిస్తున్నారు.

    అన్నీ మాన్యువలే..
    ఆ రోజులలో కంప్యూటర్స్‌ లేవు, మాన్యువల్‌ రికార్డ్స్‌ దొరకాలి. 1969 తొలి తరం తెలంగాణ ఉద్యమకారులు ఇటీవల అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌ పార్క్‌ లో సమావేశం అయ్యారు. అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నాటి ఉద్యమకారులు ఓ సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘానికి అధ్యక్షత వహిస్తున్న రామరాజు మాట్లాడారు. ‘తెలంగాణ ఉద్యమానికి బీజం వేసింది మేమే. తెలంగాణ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది మేమే. ఆ పునాదిపైన మలిదశ ఉద్యమం ఎదిగింది. మా తరంవారి రక్త తర్పనంతో మా ఆవేదన ఉద్యమంలా ఎగిసిపడింది. అమరవీరులైన మా సంఘ సభ్యులను ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. ప్రభుత్వం ఇచ్చే స్థలానికి రూపాయలలో మేము వెలకట్టడం లేదు, మాకు ఒక గుర్తింపుగా గౌరవంగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.