https://oktelugu.com/

Telangana BJP : బీజేపీకి అతిపెద్ద సవాలుగా మారిన తెలంగాణ ఎన్నికలు

Telangana BJP :

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2023 / 12:20 PM IST

    Telangana BJP : నవంబర్ 7-11వ తేదీల్లో నరేంద్రమోడీ హైదరాబాద్ లో రెండు సభల్లో ప్రసంగిస్తారు. నవంబర్ 7న బీసీ ఆత్మగౌరవ సభ, నవంబర్ 11 న ఎస్సీ వర్గీకరణపై మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. రెండు సభలల్లో రెండు పెద్ద సామాజికవర్గాలను ప్రభావితం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సభలకు పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్టు సమాచారం.

    తెలంగాణలో బీజేపీ స్టేటస్ ఏంటి? అని చూస్తే.. ఒకప్పుడు కేసీఆర్ కు ప్రత్యామ్మాయంగా.. వచ్చేసారి అధికారంలోకి వచ్చే పార్టీగా జనంలోకి బాగా హైప్ తీసుకొచ్చిన పార్టీ బీజేపీ. కానీ ఇప్పుడు కుదేలైపోయింది. ఏ సర్వే చూసినా బీజేపీకి పట్టుమని పది సీట్లు కూడా రావని అంటున్నారు.కొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందంటే.. కొన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నాయి. కొన్ని హంగ్ వస్తున్నాయని అంటున్నారు. అన్ని సర్వేలు బీజేపీకి సింగిల్ డిజిట్ కు మించి రావని స్పష్టం చేస్తున్నాయి.

    ఇన్ని సర్వేలు చెప్పిన తర్వాత బీజేపీ దారుణంగా ఓడిపోతుందని నమ్మకతప్పదు. పార్టీలకు ఓట్లు పడేదాని ప్రకారం ఓటింగ్ తీసుకుంటే.. అభ్యర్థులను ప్రకటించాక ఓటింగ్ తీసుకుంటే ఏమన్నా మార్పు వస్తుందేమో చూడాలి. అభ్యర్థులు ఆల్ మోస్ట్ ఫైనల్ అయిపోయింది. జనసేనకు సీట్లు కేటాయించాల్సి ఉంది.

    బీజేపీకి అతిపెద్ద సవాలుగా మారిన తెలంగాణ ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.