Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షోలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. షో చివరి దశకు చేరిన నేపథ్యంలో రసవత్తరంగా మారింది. ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న యావర్ దాన్ని తిరిగి ఇచ్చేశాడు. తాను ఫౌల్ గేమ్ ఆడినట్లు నాగార్జున వీడియో ఆధారాలు బయటపెట్టడంతో పాస్ నాకొద్దని త్యజించాడు. ఈ కారణంగా 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. అశ్విని-గౌతమ్ లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ ఇద్దరినీ సేవ్ చేశారు. అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అన్నాడు.
కాబట్టి ఈ వీక్ నామినేషన్స్ కీలకంగా మారాయి. నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. ప్రియాంక కెప్టెన్ కావడంతో ఆమెను మినహాయింపు దక్కింది. శోభను ఎవరూ నామినేట్ చేయలేదు. మిగిలిన శివాజీ, అమర్, అర్జున్, అశ్విని, ప్రశాంత్, గౌతమ్, రతిక, యావర్ నామినేట్ అయ్యారు. నాగార్జున చెప్పిన ప్రకారం వీరిలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటి వరకు చూసిన ఓటింగ్ సరళి చూస్తే షాకింగ్ ఫలితాలు వచ్చాయి.
మొన్నటి వరకు టాప్ లో ఉన్న శివాజీకి పల్లవి ప్రశాంత్ షాక్ ఇచ్చాడు. గురువు శివాజీని వెనక్కి నెట్టి ప్రశాంత్ 1వ స్థానంలో దూసుకుపోతున్నాడు. 2వ స్థానంలో శివాజీ ఉన్నాడు. ఇక 3వ స్థానంలో యావర్ ఉన్నట్లు సమాచారం స్పై బ్యాచ్ గా చెప్పుకునే శివాజీ, ప్రశాంత్, యావర్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక 4వ స్థానంలో అమర్, 5వ స్థానంలో గౌతమ్ ఉన్నాడట. 6వ స్థానంలో రతిక ఉందట.
అర్జున్ 7వ స్థానం, అశ్విని 8వ స్థానంలో కొనసాగుతున్నారట. టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరైన అర్జున్ ఓటింగ్ లో వెనుకంజ వేశాడని తెలుస్తుంది. ఈ లెక్కన అర్జున్, అశ్విని వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. అయితే ఓటింగ్ మొదలై కేవలం ఒక్కరోజే అవుతుంది. మరో మూడు రోజుల సమయం ఉంది కాబట్టి ఓటింగ్ రిజల్ట్ మారవచ్చు. అందరి కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఇద్దరు ఎలిమినేట్ అవుతారు.