https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : పోతూ పోతూ కన్నీళ్లు పెట్టించిన నయని పావని… శివాజీని నాన్న అంటూ ఎమోషనల్ కామెంట్స్

ఎవరు బయటకు వెళ్లాలో తేల్చేది ప్రేక్షకులు అని నాగార్జున చెప్పారు. వేదిక మీద నయని పావని ఏడుస్తూ అందరినీ ఏడిపించేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2023 / 11:22 AM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu : ఆరో వారం కూడా వరుసగా లేడీ కంటెస్టెంట్ హౌస్ ని వీడటం ఊహించని పరిణామం. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభశ్రీ గత ఐదు వారాల్లో ఎలిమినేట్ అయ్యారు. ఈ వారానికి నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. అమర్ దీప్, ప్రిన్స్ యావర్, తేజా, శుభశ్రీ, పూజా మూర్తి, అశ్వినిశ్రీ, నయని పావని నామినేట్ అయ్యారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఐదుగురిలో ముగ్గురు నామినేట్ అయ్యారు వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది.

    ప్రిన్స్ యావర్ అందరికంటే ఓటింగ్ లో ముందు ఉన్నట్లు తెలిసింది. తర్వాత అమర్ దీప్ ఉన్నాడట. వీరిద్దరి తర్వాత ఓటింగ్ లో తేజా ఉన్నట్లు సమాచారం. అశ్విని శ్రీ, నయని పావని, శోభా శెట్టి చివరి స్థానాల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ కావచ్చని ప్రచారం జరిగింది. అనూహ్యంగా నయని పావని పేరు తెరపైకి వచ్చింది. ఆదివారం నయని పావని ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పారు.

    నయని పావని తన ఎలిమినేషన్ తట్టుకోలేకపోయింది. బాగా ఏడ్చేసింది. ఇంటి సభ్యులు కూడా నయని పావని వెళ్లిపోవడంతో ఎమోషనల్ అయ్యారు. వేదిక మీద కంటెస్టెంట్ శివాజీ గురించి నయని పావని ప్రత్యేకంగా మాట్లాడింది. ఆయన్ని చూస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ అని చెప్పింది. రోజూ ఉదయాన్నే హగ్ చూసుకునేదాన్ని. అలా చేసే చనువు ఉందా అనిపించేది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మానాన్న కూడా అలానే నవ్వుతూ ఉంటారు.

    శివాజీ నువ్వు నా బిడ్డ లెక్క. మీ నాన్ననే అనుకో అనేవారని నయని పావని కన్నీళ్లు పెట్టుకుంది. శివాజీ కూడా ఎమోషనల్ అయ్యాడు. వీలుంటే తనను బయటకు పంపి నయనిని మరలా హౌస్లోకి తేవాలని అడిగాడు. ఎవరు బయటకు వెళ్లాలో తేల్చేది ప్రేక్షకులు అని నాగార్జున చెప్పారు. వేదిక మీద నయని పావని ఏడుస్తూ అందరినీ ఏడిపించేసింది. కేవలం వారం రోజులు హౌస్లో ఉన్న నయని పావని తన మార్క్ చూపించింది. అభిమానులను సొంతం చేసుకుంది.