https://oktelugu.com/

Gautham Krishna Vs Prince Yawar: బిగ్ బాస్ లో లొల్లి లొల్లి.. కొట్టుకుపోయిన ప్రిన్స్ …గౌతమ్

రెండవ వారం పవర్ అస్త్ర సాధించే రేస్ లో శివాజీ ,అమరదీప్, షకీలా ఉండగా.. ముగ్గురు ఫైనల్స్ కి రావడం కోసం జరిగిన పోటీ కొత్త వివాదానికి దారి తీసింది.

Written By: , Updated On : September 16, 2023 / 10:17 AM IST
Gautham Krishna Vs Prince Yawar

Gautham Krishna Vs Prince Yawar

Follow us on

Gautham Krishna Vs Prince Yawar: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజుకొక కొత్త ట్విస్ట్ తో ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగుతోంది. అవ్వడం కోసం కంటెస్టెంట్స్ మధ్య పోటీ గట్టిగానే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ వారం పవర్ అస్త్ర పొందడం కోసం మాయా ఆస్త్ర అనే కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. మాయ ఆస్త్రాన్ని గెలుచుకొని తదుపరి పవర్ అస్త్రానికి అర్హత పొందిన కంటెస్టెంట్స్…హౌస్ మేట్స్ కావడం కోసం కుస్తీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో స్ట్రెస్ లెవెల్స్ తట్టుకోలేక కొంత మంది కంటెస్టెంట్స్ తమ విచక్షణను కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. చిన్న మాటతో మొదలైన గొడవ పెద్ద వాదోపవాదాల వరకు వెళ్తోంది. ఏం మాట్లాడుతున్నాము… ఎలా మాట్లాడుతున్నాము… అని విషయాన్ని కూడా మరిచి ఒకరి మీద ఒకరు మాటల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఒకరకంగా బిగ్బాస్ వేస్తున్న స్ట్రాటజీ కంటెస్టెంట్స్ మధ్య రచ్చకు కారణం అవుతుంది.

రెండవ వారం పవర్ అస్త్ర సాధించే రేస్ లో శివాజీ ,అమరదీప్, షకీలా ఉండగా.. ముగ్గురు ఫైనల్స్ కి రావడం కోసం జరిగిన పోటీ కొత్త వివాదానికి దారి తీసింది. నిన్నటి ఎపిసోడ్ మొదలవడానికి ముందు ప్రిన్స్ యావర్, శివాజీ, షకీలా …ఈ ముగ్గురి చేతిలో మాయాస్త్రాలు ఉన్నాయి. అయితే ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే పవర్ అస్త్రా కోసం ఎంపిక కాబడతారు కాబట్టి.. సెలక్షన్ చేయడం కోసం వచ్చిన గౌతం ప్రిన్స్ దగ్గర ఉన్న మాయ ఆస్త్రాన్ని శివాజీ చేతిలో పెట్టాడు. ఇక దాంతో కరెక్ట్ రీజన్ చెప్పమని ప్రిన్స్ మొండికి వేశాడు.

శివాజీ మైండ్ గేమ్ బాగుందని.. అందర్నీ బాగా మేనేజ్ చేశాడని గౌతమ్ అన్నాడు. మరోపక్క ప్రిన్స్ తాను రెండు టాస్కులలో ఆడి టీం ను గెలిపించానని వాదించగా అమరదీప్ కూడా ప్రిన్స్ ని సమర్థించాడు. అయితే యావర్ మాత్రం మాయ ఆస్త్రాన్ని ఇవ్వకుండా కెమెరాల వద్దకు వెళ్లి న్యాయం కావాలి అంటూ అరచి గోల పెట్టాడు. సరియైన కారణం చెబితేనే తన మాయ అస్త్రాన్ని ఇస్తానని ప్రిన్స్ అనడంతో…ఇదే సరైన కారణం అంటూ గౌతం కూడా తిరిగి ఫైరాయ్యాడు.

చిన్న మాటతో మొదలైన వివాదం గట్టిగట్టుగా అరుచుకునే వరకు వెళ్ళింది. యావర్ ఏదో చేతితో సైగ చేస్తూ ఉన్న సమయంలో…గౌతం కూడా తాను ఇంజక్షన్ వేసుకుంటున్నట్లుగా సైగ చేయడంతో వివాదం మరింత పెద్దదిగా మారింది. నేను బాడీ బిల్డ్ చేయడం కోసం ఇంజక్షన్స్ తీసుకున్నాను అని అంటున్నావా .. నువ్వేమన్నా చూసావా ..నాకు ఎప్పుడన్నా డబ్బులు ఇచ్చావా..అని యావర్ కోపంతో ఊగిపోయాడు. ఇది కరెక్ట్ కాదు…బిగ్ బాస్ నేను ఇక్కడ ఉండలేను గేట్లు ఓపెన్ చేయండి అంటూ గట్టిగా ఏడ్చేసాడు.

చివరకు అమరదీప్ వెళ్లి యావర్ ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు…శుభ శ్రీ కూడా యావర్ కు నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. తాను ఎంతో కష్టపడి ఆడుతున్నానని…అలా ఎలా మాట్లాడుతారని ప్రిన్స్ బాధపడ్డాడు. అందరూ కలిసి మొత్తానికి అతని కన్విన్స్ చేయడంతో తన చేతిలో ఉన్న మాయ అస్త్రాన్ని గౌతమ్ చేతికి ఇచ్చేశాడు. గౌతమ్ మాయాస్త్రాన్ని శివాజీకి ఇవ్వడంతో పవర్ అస్త్రా రేసు నుంచి ప్రిన్స్ తప్పుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత బిగ్ బాస్ అతన్ని కన్ఫెక్షన్ రూమ్ లోకి పిలిచి కాస్త ధైర్యం చెప్పడంతో ప్రస్తుతానికి సెట్ అయినట్లు కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం పవరాస్త్రాలు శివాజీ, షకీలా ఉండగా.. మరొక కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ సందీప్ కు కలిగించారు. దీంతో సందీప్ పవర్ అస్త్ర రేస్ లో మూడవ సభ్యుడిగా అమరదీప్ ను సెలెక్ట్ చేశాడు. ఈ వీకెండ్ బిగ్బాస్ చెవిలో గట్టిగా అరిచే టాస్క్ లో ఈ ముగ్గురిలో ఎవరు గెలిచి పవర్ అస్త్రాను సొంతం చేసుకుంటారో చూడాలి.