Jabardasth Faima: ఉండడానికి ఇల్లు తినేదానికి తిండి ఉంటే ఆ మనిషి జీవితం దాదాపు సంతోషంగా ఉన్నట్టే అనేవారు మన పెద్దవారు. అది నూటికి నూరు శాతం నిజం. చెట్టు నీడలాగా మనకు ఎల్లప్పుడు నీడని ఇచ్చే సొంత ఇల్లు అనేది తప్పక ఉండాలి. అందుకే చాలామందికి సొంత ఇల్లు అనేది పెద్ద కల. ఒక మనిషి సంపాదించడం మొదలుపెడితే ముందుగా ఆలోచించేది ఒక సొంత ఇల్లు కొనాలనే. కార్లు, బంగ్లాలు అవసరం లేదు.. ఉండడానికి మనది అనే చిన్న పూరిగురిస ఉన్న చాలు సంతోషంగా బతకచ్చు అని అనుకునేవారు చాలామంది.
ఇక అలాంటి ఆశ బుల్లితెర నటి పైమాకి కూడా ఉండట. తన అద్భుతమైన కామెడీ పంచ్ డైలాగులతో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఈమె అతి తక్కువ సమయంలోనే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అందరినీ తన కామెడీతో నవ్వించే ప్రేమ బిగ్ బాస్ షోలో దాదాపు పది వారాలకు పైగా కంటెస్టెంట్ గా ఉంది అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది.
కాగా పైకి మనల్ని ఏంటో నవ్విచ్చే ఈయన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలను అనుభవించిందని తన తల్లి బీడీలు చుట్టి పెంచి పెద్ద చేసిందని బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తన కన్నీటి కష్టాలను పలుమార్లు తెలియజేసింది. అంతేకాదు అంతగా తనకోసం కష్టపడిన అమ్మకు తన చిరకాల కోరిక తీర్చాలని తన లక్ష్యమని కూడా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఫైమ తల్లి చిరకాల కోరిక ఏమిటి అంటే ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలన్నదట.
అందుకే తన తల్లి కోరికను నెరవేర్చడం కోసం తన తండ్రికి ఇష్టం లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చానని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫైమా కొద్దిరోజుల క్రితం చెప్పుకొచ్చారు. ఇక ఫైమా గురించి విన్న వారందరూ తన కోరిక ఎప్పటికన్నా నెరవేరాలని తలిచారు. కాగా తాజాగా తన సొంత ఇంటి కల నెరవేరిందని తెలుస్తోంది. తన సొంత ఇంటి కలతో పాటు తన తల్లి కోరికను కూడా నెరవేర్చారని తెలుస్తుంది.
ఇక ఈ విషయం ఎలా తెలిసింది అంటే తాజాగా గృహప్రవేశానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసారు ఫైమా. ఇక దీని ద్వారా ఫైమా కోరిక నెరవేరింది అని తెలియడంతో
అభిమానులు ఈ ఫోటోలపై స్పందిస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ఫైమా పర్సనల్ విషయాలకు వస్తే ఈమె ప్రస్తుతంపటాస్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నారు.
వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నామని కూడా ఈ మధ్యనే వెల్లడించారు.
