Bigg Boss 6 Telugu- Inaya Sultana: ప్రతి సోమవారం బీగ్ బాస్ లో నామినేషన్స్ వచ్చింది అంటే చాలు..హౌస్ మొత్తం ఎంత హీట్ వాతావరణం ఉంటుందో మన అందరికి తెలిసిందే..ఈ వారం కూడా నామినేషన్స్ వాడివేడిగా సాగాయి..గత వారం హౌస్ నుండి సూర్య ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది..ఇంటి సభ్యులందరికి సూర్య అంటే మంచి అభిమానం..ఎందుకంటే అతడు ప్రతి ఒక్కరితో చాలా మంచిగా ఉంటాడు.

హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి అతడు ఒకరిని నొప్పించి మాట్లాడడం ఎప్పుడు కూడా జరగలేదు..హౌస్ లో అందరికంటే అతను ఆరోహి, ఇనాయ సుల్తానా మరియు కీర్తి బాగా క్లోజ్ గా ఉంటూ వచ్చారు..కానీ గత కొంత కాలంగా ఇనాయ సుల్తానా సూర్య ని టార్గెట్ చేస్తూ వచ్చింది..పోయిన వారం సూర్య ని నామినేట్ చేసిన ఇంటి సభ్యులు కేవలం ఇద్దరు అయితే అందులో ఇనాయ సుల్తానా కూడా ఒకరు..ఈరోజు హౌస్ లో సూర్య బయటకి వెళ్ళడానికి కారణం కూడా ఇనాయ సుల్తాననే.
కానీ సూర్య హౌస్ నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఇనాయ వెక్కిళ్లుపెట్టి మరి ఏడుస్తుంది..చెయ్యాల్సింది అంతా చేసి ఈరోజు ఈ నాటకాలు ఎందుకు అని నామినేషన్స్ లో అందరూ ఇనాయ ని తప్పుబడుతూ నామినేట్ చేసారు..నీ అంత ఫేక్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎవ్వరూ ఉండరు అని ఆది రెడ్డి ఇనాయ సుల్తానా ని నామినేట్ చేస్తాడు..’సరైన టైం లో చూసి సూర్య ని కొట్టాల్సిన చోట కొట్టావు..దెబ్బకి అతను ఎలిమినేట్ అయిపోయాడు నీవల్ల’ అంటూ నామినేట్ చేస్తాడు.

మరో పక్క శ్రీహాన్ కూడా ఇనాయ ని ‘వారానికి ఒక రంగు మార్చే ఊసరవెల్లి నాకు ఊసరవెల్లి అని ట్యాగ్ ఇచ్చింది..స్నేహం లో నువ్వు పొడిచినన్ని వెన్ను పోట్లు నాకు తెలిసి హౌస్ లో ఎవ్వరూ పొడిచి ఉండరు’ అంటూ ఇనాయ ని నామినేట్ చేస్తాడు..అలాగే రేవంత్ , ఫైమా ఇలా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఇనాయ ని బాగా ఎక్సపోజ్ చేసి ఆమె ఎంత ఫేక్ కాండిడేట్ అనేది చెప్పడానికి ప్రయత్నం చేసారు..మరి వీటి అన్నిటికి ఇనాయ ఎలా సమాధానం చెప్తుందో చూడాలి.
