Revanth Reddy – Rahul Gandhi: టీపీసీసీ చీఫ్ రాహుల్ గాంధీ కోరికను ఎట్టకేలకు నెరవేర్చాడు అధినేత రాహుల్ గాంధీ. బీజేపీకి దూరమవుతూ కాంగ్రెస్ కు దగ్గర అవుతున్న కేసీఆర్ తో పొత్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో పొత్తు దిశగా కదులుతున్న కేసీఆర్ ముందరి కాళ్లకు రాహుల్ బంధం వేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. ఒంటరిగానే పోటీచేస్తామని రాహుల్ తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ తో పొత్తు ఉండొద్దు అన్నది తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం అని.. దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని బట్టి అటు టీఆర్ఎస్ ను ప్రత్యర్థిగా ప్రకటించి.. ఇటు రేవంత్ లాంటి కరుడుగట్టిన టీఆర్ఎస్ వ్యతిరేక వాదులకు రాహుల్ ఉపశమనం కలిగించారు.

టీడీపీలో కొనసాగిన రేవంత్ రెడ్డి చంద్రబాబుకు రైట్ హ్యాండ్ గా తెలంగాణలో ఉన్నారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆయన బీజేపీని కాదని కాంగ్రెస్ లో చేరారు. నిజానికి రేవంత్ రెడ్డి చేరే సమయంలో కేంద్రంలోని బీజేపీతో కేసీఆర్ సన్నిహితంగా మెలిగారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రోద్బలంతో ముందస్తుకు వెళ్లి నిర్వహించుకున్నారు.
ఇక చంద్రబాబు 2019 అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీని ఎదురించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని దేశమంతా తిరిగారు.ఆ ఊపులోనే తన సన్నిహితుడైన రేవంత్ రెడ్డి సైతం బీజేపీలోకి వద్దని వారించి కాంగ్రెస్ చేరిపించారు. నాడు బీజేపీ, టీఆర్ఎస్ కలిసే అవకాశం ఉందని.. బీజేపీలో ఉంటే తన శత్రువైన కేసీఆర్ పై పోరాటం చేయలేనని భావించి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో చేరారు. అచెంలంచెలుగా ఎదిగి టీపీసీసీ చీఫ్ అయ్యారు.

రేవంత్ కోరుకున్నట్టు జరగలేదు. తెలంగాణలో బీజేపీ ఇప్పుడు కేసీఆర్ కు ప్రధాన శత్రువైంది. అదే సమయంలో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ సార్వత్రిక ఎన్నికల తర్వాత కలుస్తాయన్న ప్రచారం ఊపందుకుంది. బీజేపీ ఇదే అంటోంది.
అందుకే తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి చేత కీలక ప్రకటన చేసేలా రేవంత్ రెడ్డి ఒప్పించాడు. తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు ఉండదని.. ఒంటరిగా పోటీచేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేశారు. ఇప్పుడు రేవంత్ గుండెల మీద చేయి వేసుకొని టీఆర్ఎస్ పై పోరాటం చేయవచ్చు. ఆయన కోరుకున్నదే అధినేత రాహుల్ నెరవేర్చాడని చెప్పొచ్చు.