Bigg Boss 6 Telugu- Galatta Geetu Adi Reddy: బిగ్ బాస్ హౌస్ లో ఎవరినీ నమ్మడానికి వీల్లేదు. ఎవరి గేమ్ వారిది ఎవరి స్వార్థం వారిది. బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్స్ నుండి ఆశించేది ఇదే. తమ ప్లాన్స్ తో కంటెస్టెంట్స్ ని బోల్తా కొట్టించేవారిని బాగా ఇష్టపడతారు. కాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న ఆదిరెడ్డికి గీతూ వెన్నుపోటు పొడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. నువ్వు అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదనే సందేశం పంపుతుంది. గీతూ ఆదిరెడ్డితో ఈ వారం నువ్వు ఎలిమినేట్ అయిపోతావనిపిస్తుందని నేరుగా చెప్పింది.

నువ్వు పెద్దగా ఎంటర్టైన్ చేయడం లేదు. పొద్దున్న కొంచెం ఎంటర్టైన్ చేశావు. ఇక రోజంతా ఖాళీగా ఉన్నావు. ఏదైనా సేవ్ అయితే నావల్లే సేవ్ అవుతావు. కానీ నీ కారణంగా ఎవరైనా ఎంటర్టైన్ చేసే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే నేను బాధపడతా. ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలి. అప్పుడే కదా కామెడీ. ఈ వారం చాలా మంది నామినేట్ అయ్యారు. ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఎలిమినేటై విషయం లేనోళ్ళు సేవ్ కావచ్చు.. అంటూ జోస్యం చెప్పింది.
గీతూ మాటలు ఆదిరెడ్డిలోని విశ్వాసాన్ని, ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయి. ఈ మాటలు ఆమె గేమ్ ప్లాన్ లో భాగమే అనిపిస్తుంది. నిజానికి ఆదిరెడ్డి టాప్ కంటెస్టెంట్ గా దూసుకుపోతున్నాడు. అతని గేమ్ చాలా పరిపక్వతతో కూడుకొని ఉంది. అంచనా ప్రకారం అతడు టాప్ ఫైవ్ లో ఉండటం ఖాయం. గీతూ సైతం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నారు. ఈ క్రమంలో స్ట్రాంగ్ గా ఉన్న ఆదిరెడ్డిని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఆదిరెడ్డిపై చేయి సాధించాలని చూస్తుంది.

షో స్టార్ట్ అయినప్పటి నుండి గీతూ, ఆదిరెడ్డి మిత్రులుగా ఉంటున్నారు. ఆదిరెడ్డి గీతక్కా గీతక్కా అంటూ ఎప్పుడూ ఆమె పక్కనే ఉంటున్నాడు. అంత స్నేహం చేస్తున్న మనిషిని వెన్నుపోటు పొడిచే కార్యక్రమం పెట్టుకుంది. కాగా నిన్న బిగ్ బాస్ పెట్టిన నిబంధనలు అతిక్రమించినందుకు గీతూ, ఆదిరెడ్డిలకు శిక్ష పడింది. ఇద్దరినీ పాత్రలు కడగమని బిగ్ బాస్ ఆదేశించారు. ఆదిరెడ్డి తన ఫుడ్ గీతూకి పెట్టడంతో బిగ్ బాస్ వారిని శిక్షించడం జరిగింది. కాగా ఈ వారం అత్యధికంగా 13 మంది నామినేషన్స్ లో ఉన్నారు.