Akkineni Nagarjuna- Aadi Reddy: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్కు ఎంత వాడివేడిగా సాగిందో మన అందరికి తెలిసిందే..ఫిజికల్ టాస్కు అవ్వడం తో ఇంటి సభ్యులందరు రెచ్చిపొయ్యి మరీ ఆడారు..ఇక హౌస్ లో ఉన్న ఆడవాళ్లు అయితే మగవాళ్ళతో పోటీపడీమరీ ఆడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ముఖ్యంగా ఇనాయ , వాసంతి వంటి కంటెస్టెంట్స్ అయితే విజృంభించేసారు..ఇనాయ అయితే టాస్కు ముగిసేవరకు కూడా చనిపోలేదు.

అయితే ఈ కెప్టెన్సీ టాస్కులో ఎన్నో ఎత్తులు మరియు వ్యూహాలతో ‘రెడ్ స్క్వాడ్’ టీం కి సంబంధించిన కంటెస్టెంట్ శ్రీ సత్య గెలిచి ఈ వారం కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..రెడ్ స్క్వాడ్ లో గీతూ వేసిన ఎత్తులు చూస్తే ఇలా కూడా ఆడొచ్చా అని ఆశ్చర్యపోక తప్పదు..విచిత్రమైన వ్యూహాలతో బ్లూ స్క్వాడ్ టీం లీడరైన ఆదిరెడ్డి ని తీవ్రమైన కోపానికి గురైయ్యేలా చేసి అతని మైక్ ని నేలకేసి కొట్టేలా చేసి టాస్కు నుండి వైదొలగేలా చేసింది.
అయితే టీం లీడర్ గా ఆది రెడ్డి వ్యవహరించిన తీరు..సీక్రెట్ టాస్కుని విజయవంతంగా పూర్తి చేసిన విధానం ప్రతి ఒక్కరికి బాగా నచ్చింది..అంతే కాకుండా అతను గీతూ చేత మోసపోవడం ప్రేక్షకుల్లో అతని పై సానుభూతి పెరిగేలా చేసింది..కెప్టెన్సీ టాస్కులో చివరి రౌండ్ లో సంచాలక్ గా కూడా ఆదిరెడ్డి నూటికి నూరుపాళ్లు తన జాబ్ కి న్యాయం చేసాడు..గీతూ మరియు ఆది రెడ్డి వేర్వేరు టీం లీడర్స్ గా వ్యవహరించిన సంగతి మన అందరికి తెలిసిందే..గీతూ తనకి బెస్ట్ ఫ్రెండ్ అయ్యినప్పటికీ కూడా ఏ మాత్రం భేదభావం చూపించకుండా అతను అద్భుతంగా ఆడాడు.

వీటిని ఈరోజు జరగబొయ్యే ఎపిసోడ్ లో అక్కినేని నాగార్జున మెచ్చుకున్నట్టు తెలుస్తుంది..అంతే కాకుండా ఈ వారం హద్దులు మీరు ప్రవర్తించిన కంటెస్టెంట్స్ కి కూడా నాగార్జున గట్టిగా కోటింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది..గత వారం లో పద్దతి మార్చుకోమని చెప్పిన కంటెస్టెంట్స్ అందరూ ఈ వారం మరింత హద్దులు దాటి ప్రవర్తించడం పై నాగార్జున గారు ఫైర్ అయ్యినట్టు సమాచారం.