Bigg Boss 6 Telugu- Geetu: గత కొద్ది వారాల నుండి బిగ్ బాస్ ఎవ్వరి ఊహాకి అందని విధంగా ముందుకు సాగుతోంది.. ఎలిమినేషన్స్ కూడా అదే విధంగా జరుగుతున్నాయి..గడిచిన రెండు వారాలలో అర్జున్ కళ్యాణ్ – సూర్య వంటి టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది..సూర్యది ఎలిమినేషన్ కాదని.. అతనిని సీక్రెట్ రూమ్ లోకి పంపుతారని అందరూ అనుకున్నారు..కానీ అది జరగలేదు.

ఇక ఈ సీజన్ లో సీక్రెట్ రూమ్ ఉందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది..గత సీజన్ లో కూడా సీక్రెట్ రూమ్ లో ఏ ఒక్క కంటెస్టెంట్ ని కూడా పంపలేదు బిగ్ బాస్..సోషల్ మీడియా లో ఉండే ఆడియన్స్ కూడా సీక్రెట్ రూమ్ లోకి ఎవరిని పంపబోతున్నారని చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు.
కానీ ఈ వారం సీక్రెట్ రూమ్ లోకి ఒక కంటెస్టెంట్ ని కచ్చితంగా పంపబోతున్నారని తెలుస్తుంది.. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు..హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న గీతూ రాయల్ అట..ఈ వారం ఆమె ఎలిమినేషన్ కి గురైనట్టు హౌస్ మేట్స్ అందరిని నమ్మేలా చేసి సీక్రెట్ రూమ్ కి పంపబోతున్నట్టు తెలుస్తోంది.. ఎప్పుడూ టాస్కులలో కిక్ కోరుకునే గీతూకి ఇది ఆమెకి సూపర్ గా అనిపించే గేమ్ అని చెప్పొచ్చు.. మరోపక్క నాగార్జున నుండి ఈ వారం ఆమెకి చీవాట్లు గట్టిగానే పడినట్టు తెలుస్తోంది.

ఎందుకంటే బాలాదిత్య బలహీనతతో చీప్ గేమ్ ఆడిన గీతూపై నాగార్జున ఫైర్ అయ్యినట్టు తెలుస్తోంది..కేవలం గీతూ ని మాత్రమే కాదు..ఈ వారం హౌస్ లో లైన్ దాటి ప్రవర్తించిన ప్రతీ కంటెస్టెంట్ కి నాగార్జున నుండి మరోసారి బలంగా కోటింగ్ పడిందట..చూడాలిమరి ఈరోజు జరగబొయే ఎపిసోడ్ ఎంత రసవత్తరంగా సాగబోతుందో అనేది.