spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 6 Telugu: షాకింగ్ ట్విస్ట్... మామ స్థానంలో మాజీ కోడలు!

Bigg Boss 6 Telugu: షాకింగ్ ట్విస్ట్… మామ స్థానంలో మాజీ కోడలు!

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6కి సన్నాహాలు జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో ఈ క్రేజీ షో ప్రసారం కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ 6 ప్రోమో విడుదల చేశారు. హోస్ట్ నాగార్జున ఈసారి సామాన్యులకు కూడా అవకాశం అంటూ ప్రకటించారు. గత మూడు సీజన్స్ నాగార్జున సారథ్యంలో సక్సెస్ ఫుల్ గా నడిచాయి. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ 2017 లో ప్రారంభం కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ విషయంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ సీజన్ కి కూడా ఎన్టీఆర్ నే నిర్వాహకులు సంప్రదించారు. అయితే ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఎన్టీఆర్ ఈ ఆఫర్ సున్నితంగా తిరస్కరించారు.

Bigg Boss 6 Telugu
samantha, nagarjuna

దీంతో హీరో నాని సీజన్ 2 హోస్ట్ గా వ్యవహరించారు. నాని హోస్టింగ్ పై మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరు మీలో కోటీశ్వరుడు హోస్ట్ గా సక్సెస్ అయిన నాగార్జునను రంగంలోకి దించారు. సీజన్ 3 నుండి ఆయనే బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అనూహ్యంగా సమంత పేరు తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6 హోస్ట్ బాధ్యతలు సమంత చేపట్టనున్నారనేది లేటెస్ట్ టాక్. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.

Also Read: Sunny Leone: సెక్స్ వర్కర్ కు ఫోర్న్ స్టార్ కు మధ్య తేడా ఏంటి..? సన్నీ లియోన్ సంచలన సమాధానం

బిగ్ బాస్ సీజన్ 4లో ఓ వారం సమంత హోస్ట్ గా సందడి చేశారు. వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం నాగార్జున మనాలి వెళ్లారు. దీంతో ఆ వారాంతం సమంత నాగార్జున బాధ్యత తీసుకొని విజయవంతంగా నిర్వహించారు. ఈసారి ఆమె ఫుల్ సీజన్ కి హోస్ట్ గా చేస్తారట. అయితే ఇది సాధ్యమయ్యే సూచనలు లేవు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సమంతకు బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించే తీరిక దొరక్కపోవచ్చు. అలాగే ఆమె మకాం ముంబైకి మార్చారు. బిగ్ బాస్ షూటింగ్ కోసం ప్రతివారం హైదరాబాద్ రావడం కష్టమే. కాబట్టి ఈ రూమర్స్ లో నిజం ఉండకపోవచ్చు.

Bigg Boss 6 Telugu
samantha

ఒకవేళ నిజంగా సమంత హోస్టింగ్ చేస్తే… షో ఒకింత కొత్తదనం సంతరించుకుంటుంది. ఇక ఆహా యాప్ లో సమంత ఓ సెలెబ్రిటీ టాక్ షో నిర్వహించిన విషయం తెలిసిందే. సామ్ జామ్ పేరుతో ప్రసారమైన ఈ షోలో సమంత చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రానా వంటి పలువురు స్టార్స్ ని ఇంటర్వ్యూ చేశారు. తన క్యూట్ క్యూట్ మాటలతో మెస్మరైజ్ చేశారు. అయితే ఈ షోకి ఊహించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు.

Also Read:Ravi Teja Remuneration: ఏంటీ రవితేజకు డబ్బు పిచ్చిపట్టిందా?
Recomended Videos
అనుష్క తల్లిదండ్రులని ఎప్పుడు అయిన చూసారా | Anushka Shetty Family Moments | Oktelugu Entertainment
నటి పూర్ణ ఎంగేజ్మెంట్ || Actress Poorna Got Engaged To Business Man || Oktelugu Entertainment
Arjun Reddy Heroine Shalini Pandey Latest Video Playing In Pool || Shalini Pandey Latest Video

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version