Star Heros Who Missed Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 25 వ తారీఖున విడుదల అయ్యి భారీ విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..టీజర్స్ మరియు ట్రైలర్స్ తోనే అంచనాలు ఒక్క రేంజ్ లో రేపిన ఈ చిత్రం, విడుదల తర్వాత ఆ అంచనాలను మొదటి ఆట నుండే అందుకొని సూపర్ హిట్ టాక్ తో రికార్డు కలెక్షన్స్ ని వసూలు చేసింది..ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమాకి టికెట్ రేట్స్ ఇవ్వకపోయినా కూడా 100 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి, పవర్ స్టార్ స్టామినా ఏమిటో మరోసారి అందరికి అర్థం అయ్యేలా చేసింది..పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఇంత ఊర మాస్ రోల్ ఇంతకు ముందు చెయ్యలేదు అనే చెప్పాలి..తమ అభిమాన హీరో ని ఆ యాంగిల్ లో చూసిన అభిమానులకు నిజంగా పూనకాలు వచ్చాయి అని చెప్పొచ్చు..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయినా అయ్యప్పనుం కోషియుమ్ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన సంగతి మన అందరికి తెలిసిందే..మలయాళం వెర్షన్ లో పవన్ కళ్యాణ్ పాత్ర ని బిజూ మీనన్, మరియు రానా పాత్ర ని పృథ్వీ రాజ్ సుకుమారన్ పోషించారు..సోషల్ మీడియా లో ఈ సినిమా కి వచ్చిన రెస్పాన్స్ చూసి రీమక్స్ రైట్స్ కొనుగోలు చెయ్యడానికి నిర్మాతలు క్యూ కట్టారు..ముందుగా ఏ సినిమాని వెంకటేష్ – రానా కాంబినేషన్ లో తీద్దాం అనుకున్నారు..కానీ ఎందుకో కుదర్లేదు..ఆ తర్వాత ఒక్క ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బాలకృష్ణ మరియు రవితేజ కాంబినేషన్ లో తీద్దాం అనుకున్నారు..ఎందుకో ఆ కాంబినేషన్ కూడా కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల కుదర్లేదు..ఒక్క రోజు నాగ వంశి సోషల్ మీడియా లో ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ ని చూసాడు..చూడగానే ఈ సినిమా అతనికి ఎంతో నచ్చడం తో త్రివిక్రమ్ కి ఫోన్ చేసి ఈ సినిమా చూడండి చాలా బాగుంది అని సజెస్ట్ చేసాడట.
Also Read: Mahesh- Trivikram: మహేష్ తో అయినా కొత్తగా ట్రై చెయ్ త్రివిక్రమ్!
త్రివిక్రమ్ ఆ మూవీ చూడగానే వెంటనే ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనేసుకో,ఇది మనం పవన్ కళ్యాణ్ గారితో చేయిద్దాం అని చెప్పాడట..త్రివిక్రమ్ ఆ మాట అనడం తో వెంటనే పవన్ కళ్యాణ్ కి చెప్పి ఈ స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసి షూటింగ్ ప్రారంభించారు..అయితే మలయాళం లో పృథ్వీ రాజ్ క్యారక్టర్ ని ఎవరితో చేయిస్తే బాగుంటుంది అనే సందిగ్ధం లో పడ్డారు అట దర్శక నిర్మాతలు..తొలుత రవితేజ కాల్ షీట్స్ కోసం బాగా ట్రై చేసారు..కానీ చివరి నిమిషం లో కుదర్లేదు..ఇక ఆఖరికి రానాకీ ఈ స్క్రిప్ట్ మొత్తం వివరించగా ఆయనకీ ఎంతో నచ్చి ఈ సినిమాలో చెయ్యడానికి ఒప్పుకున్నాడు..ఇక ఆ తర్వాత హిస్టరీ మనకి తెలిసిందే..పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ సినిమా ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి..అంతే కాకుండా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న హీరో రానా కి కూడా ఈ సినిమా చాలా ఉపయోగపడింది..బాహుబలి సిరీస్ తర్వాత ఆయనకీ మంచి పేరు ని తెచ్చిపెట్టిన సినిమా ఇదే.
Also Read: Telangana Rains: వానలు వచ్చేవి అప్పుడే.. మరో 4 రోజులు హైఅలెర్ట్