https://oktelugu.com/

Big Boss 6: బిగ్ బాస్ లోకి లేడీ ‘పుష్ప’.. షేక్ అవ్వడం ఖాయమట..

Big Boss 6: ఆ మధ్య ‘పుష్ప’ సినిమా విడుదలైనప్పుడు చిత్తూరు యాసలో అల్లు అర్జున్ ను ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది ఓ ముద్దుగుమ్మ. ఆమెది చిత్తూరే. హైదరాబాద్ లో యాంకర్ గా చేస్తోంది. టీవీ షోలలో అలరిస్తుంది. బన్నీని వారి సొంత భాషలో ఇంటర్వ్యూ చేశాక పాపులర్ అయ్యింది. ఆమె చిత్తూరు యాసను చూసి హైపర్ ఆది తన స్కిట్ లో ‘లేడీ పుష్ప’ అనే క్యారెక్టర్ ను పెట్టి జబర్ధస్త్ లో పర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 16, 2022 / 07:00 PM IST
    Follow us on

    Big Boss 6: ఆ మధ్య ‘పుష్ప’ సినిమా విడుదలైనప్పుడు చిత్తూరు యాసలో అల్లు అర్జున్ ను ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది ఓ ముద్దుగుమ్మ. ఆమెది చిత్తూరే. హైదరాబాద్ లో యాంకర్ గా చేస్తోంది. టీవీ షోలలో అలరిస్తుంది. బన్నీని వారి సొంత భాషలో ఇంటర్వ్యూ చేశాక పాపులర్ అయ్యింది. ఆమె చిత్తూరు యాసను చూసి హైపర్ ఆది తన స్కిట్ లో ‘లేడీ పుష్ప’ అనే క్యారెక్టర్ ను పెట్టి జబర్ధస్త్ లో పర్ ఫామ్ చేశాడు. అది కూడా బాగా పండడంతో ఈ చిత్తూరు బ్యూటీకి మంచి పేరు వచ్చింది. ఆమె ఎవరో కాదు ‘గీత’.

    Geethu Royel:

    Also Read: Lokesh Kanagaraj- Prashanth Neel: సినిమాలు ఎలా తీయాలో చూపిస్తున్న ఈ ఇద్దరు డైరెక్టర్లు.. వారి విజయ రహస్యం ఇదే!

    అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 6వ సీజన్ లో కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయ్యినట్టు తెలిసింది. సెప్టెంబర్ 4వ తేదీ బిగ్ బాస్ 6వ సీజన్ మొదలు కాబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు  టీజర్ లు కూడా వదలారు.ఈసారి గ్లామరస్ బ్యూటీలను ఎక్కువగా తీసుకురాబోతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది అమ్మాయిల పేర్లు కూడా బయటకు వచ్చాయి. తాజాగా సమాచారం ప్రకారం. ఆరో సీజన్ లో జబర్ధస్త్ షో వల్ల ఫేమస్ అయిన చిత్తూరు యాస భామ గీతా రాయల్ ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతోందని తెలిసింది.

    Big Boss Season 6:

    Also Read: Veerasavarkar and Tipu Sultan: వీరసావర్కర్, టిప్పు సుల్తాన్ ల కోసం మళ్లీ మత ఘర్షణ, కత్తిపోట్లు

    గీతూ రాయల్ చిత్తూరు యాసలో యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ గుర్తింపు పొందింది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ షోకు రివ్యూలు చెప్తూ ఎన్నో వీడియోలు చేసింది. ఈ క్రమంలో  జబర్ధస్త్ లోకి వచ్చి పుష్ప స్కిట్ చేసి పాపులర్ అయ్యింది. ఈ ఒక్క దానితోనే ఆమె ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.

    Geethu Royel:

    తాజాగా గీతాకు ఏకంగా బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కిందట.. ఆమె ఈసారి బిగ్ బాస్ లో ఎలా సందడి చేస్తుందన్నది వేచిచూడాలి. ఈసారి బిగ్ బాస్ లో మొత్తం 17 మంది కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారని తేలింది. వారి పేర్లు కూడా బయటకు పొక్కాయి. తాజాగా గీతా పేరు కూడా బయటకు వచ్చింది. దీంతో ఈ లేడీ పుష్ప ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందున్నది వేచిచూడాలి.