https://oktelugu.com/

Amar Deep : బిగ్ బాస్ కంటే నాకు అదే ముఖ్యం.. మళ్ళీ ఛాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు అమర్ షాకింగ్ కామెంట్స్

రవితేజతో సినిమానే ముఖ్యం. మళ్ళీ బిగ్ బాస్ లో అవకాశం ఇవ్వకపోయినా పర్వాలేదు అంటూ అమర్ దీప్ సంచలన కామెంట్స్ చేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : January 19, 2024 / 04:46 PM IST
    Follow us on

    Amar Deep : బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. బిగ్ బాస్ షో ద్వారా నెగిటివిటీ తెచ్చుకున్న అమర్ మళ్ళీ ఈ రియాలిటీ షోలో అవకాశం రాకపోయినా పర్లేదు అంటూ, షాకింగ్ కామెంట్స్ చేశారు. అమర్ పలు సీరియల్స్ లో నటించి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ మా లో ప్రసారమయ్యే ‘జానకి కలగనలేదు సీరియల్ లో రామ పాత్ర బాగా క్లిక్ అయింది. అలా ఫేమస్ అయిన అమర్ బిగ్ బాస్ 7 లో ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.

    మొదట్లో నెగిటివిటీ వచ్చినప్పటికీ .. చివర్లో పుంజుకుని టైటిల్ రేస్ లో నిలిచాడు. కానీ కొద్దిపాటి ఓటింగ్ తేడా తో టైటిల్ మిస్ అయ్యాడు. దీనిపై అమర్ దీప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అయితే టైటిల్ కోల్పోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదని అన్నారు. నాకు సినిమా అంటే పిచ్చి. అలాగే హీరో రవి తేజ అంటే చాలా ఇష్టం అని పలు మార్లు హౌస్ ఉన్నప్పుడు చెప్పాడు.

    అలాగే ఫినాలే రోజు రవి తేజ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. హోస్ట్ నాగార్జున ఇప్పుడు బయటకు వచ్చేస్తే .. రవితేజ సినిమాలో నటించే అవకాశం వస్తుంది. టైటిల్ కావాలో ఛాన్స్ కావాలో తేల్చుకో అనగా .. క్షణం కూడా ఆలోచించకుండా టైటిల్ వదులుకోవడానికి అమర్ సిద్ధపడ్డాడు. అయితే తనకు రవితేజ సినిమాలో అవకాశం దక్కడం అతి పెద్ద గెలుపు గా భావిస్తున్నానని పలు ఇంటర్వ్యూల్లో అమర్ చెప్పాడు.

    తాజా ఇంటర్వ్యూలో అమర్ మరోసారి ఈ విషయాన్ని లేవనెత్తాడు. ఆయన మాట్లాడుతూ… ‘ ఆరోజు నేను తీసుకున్న నిర్ణయం లో ఎప్పటికీ మార్పు ఉండదు. నాకు రవితేజ గారు అంటే చాలా ఇష్టం ‘అన్నాడు. బిగ్ బాస్ లో ఒక సీజన్ తర్వాత మళ్ళీ ఛాన్స్ రాదు కదా?ఎందుకు టైటిల్ వదుకోవాలని అనుకున్నారు? అని యాంకర్ అడగ్గా … కావాలంటే బిగ్ బాస్ కి నెక్స్ట్ సీజన్ లో వచ్చేవాడిని. రవితేజతో సినిమానే ముఖ్యం. మళ్ళీ బిగ్ బాస్ లో అవకాశం ఇవ్వకపోయినా పర్వాలేదు అంటూ అమర్ దీప్ సంచలన కామెంట్స్ చేశారు.