https://oktelugu.com/

India vs Pakistan: ఇదీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఫీవర్.. నిమిషాల్లోనే అంతా ఖతం

India vs Pakistan: క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తో ఆడాలి. మిగతా ఏ దేశంతో ఆడినా మజా రాదు. రెండు దాయాది దేశాలు కావడంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ. దీంతో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ మేరకు ఇంకా సమయం ఉన్నా రెండు జట్ల అభిమానుల్లో క్రేజీ రోజురోజుకు పెరుగుతోంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆగస్టు 28న ఆదివారం యూఏఈ వేదికగా జరగనుంది. దీనికి సంబంధించిన టికెట్లు కొన్ని నిమిషాల్లోనే హాట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 16, 2022 7:25 pm
    Follow us on

    India vs Pakistan: క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తో ఆడాలి. మిగతా ఏ దేశంతో ఆడినా మజా రాదు. రెండు దాయాది దేశాలు కావడంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ. దీంతో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ మేరకు ఇంకా సమయం ఉన్నా రెండు జట్ల అభిమానుల్లో క్రేజీ రోజురోజుకు పెరుగుతోంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆగస్టు 28న ఆదివారం యూఏఈ వేదికగా జరగనుంది. దీనికి సంబంధించిన టికెట్లు కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయంటే ప్రేక్షకులకు ఎంతటి సరదా ఉందో అర్థమవుతోంది. టికెట్ల అమ్మకంలో ప్రేక్షకులు ఎగబడి కొనుగోలు చేయడం తెలిసిందే. దీంతో రాత్రి 7.30 గంటల వరకే టికెట్లు అమ్ముడుపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

    India vs Pakistan Asia cup 2022:

    India vs Pakistan Asia cup 2022:

    Also Read: Big Boss 6: బిగ్ బాస్ లోకి లేడీ ‘పుష్ప’.. షేక్ అవ్వడం ఖాయమట..

    దాదాపు పదిహేను రోజుల నుంచే అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తమ జట్టే ఫేవరేట్ అంటే తమ జట్టని వాదనలు పెట్టుకుంటున్నాయి. అటు పాకిస్తాన్ ఇటు ఇండియా అభిమానుల్లో కంగారు పుడుతోంది. ఇప్పటికైతే ఇండియానే ఫేవరేట్ గా క్రీడాకారులు జోస్యం చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా కప్ గెలుచుకోవడానికి రెండు జట్లు హోరాహోరీగా పోరాటం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కసరత్తులు కూడా చేస్తున్నాయి. వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ప్రత్యర్థి జట్లును దెబ్బకొట్టేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

    India vs Pakistan:

    India vs Pakistan:

    Also REad: China Spy Ship in Sri Lanka: కవ్విస్తున్న డ్రాగన్‌.. శ్రీలంకకు చైనా నిఘానౌక.. భారత అభ్యంతరం బేఖాతర్‌!

    ఇప్పటికే టీమిండియా ఆసియా కప్ ను ఏడుసార్లు కైవసం చేసుకుని ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది. ఇక ప్రస్తుతం కూడా అదే జోరు కొనసాగించి అభిమానుల ఆశలను వమ్ము చేయకూడదని భావిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్, వెస్టిండీస్ లలో అటు టీ 20, వన్డే కప్ లను చేజిక్కించుకుని వాటికి సవాలు విసిరింది. ఈ క్రమంలో ప్రస్తుతం కూడా ఆసియా కప్ లో ఫేవరేట్ గా బరిలో దిగుతోంది. దీంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ రేకెత్తుతోంది. అందుకే టికెట్ల కొనుగోలులో అభిమానులు అంతటి శ్రద్ధ చూపించినట్లు తెలుస్తోంది.

    India vs Pakistan:

    India vs Pakistan:

    Also Read: Nuclear War: అణుయుద్ధం ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా? ఎంత మంది మరణిస్తారంటే?

    దాదాపు 7.5 లక్షల మంది ప్రేక్షకులు ఆన్ లైన్ మీద దండయాత్రలా చేసి టికెట్లు చేజిక్కించుకున్నారు. దీనిపై బీసీసీఐ యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని విమర్శలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో అక్టోబర్ 28న జరగనున్న టీ20 ప్రపంచ కప్ టికెట్లు ఇదే కోవలో అమ్ముడుపోవడం విశేషం. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానులకు ఉన్న క్రేజీ ఏంటో టికెట్ల అమ్మకాల్లోనే తెలిసింది. దీంతో ఇరు జట్లు ఏ మేరకు అభిమానుల కోరికలు నెరవేరుస్తాయో వేచి చూడాల్సిందే మరి.