Veerasavarkar and Tipu Sultan: స్వాతంత్ర్య దినోత్సవ వేళ సంబరాలు జరుపుకుంటున్నాం. కానీ కొన్ని చోట్ల గొడవలు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటకలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన గొడవలకు కొందరు బలైపోవడం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సొంత ఊరు శివమొగ్గలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ర్యాలీలో వివాదాలు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య రగిలిన వివాదం చిరవకు కత్తిపోట్లకు కూడా దారి తీయడం గమనార్హం.
Also Read: Diet Soda: డైట్ సోడా రోజూ తీసుకుంటే వారికి కంటి చూపు పోయే ప్రమాదం ఉందని తెలుసా?
దీంతో ఊళ్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కృషి చేస్తున్నారు.సోమవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఒక వర్గం వారు ర్యాలీ తీస్తున్నారు. దీంతో మరో వర్గం వారు కూడా ర్యాలీ చేపట్టారు. కానీ వారు టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీతో ర్యాలీ తీయడంతో వివాదం చోటుచేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధులను కాకుండా వేరే వారి ఫ్లెక్సీ ఎలా పెడతారని ప్రశ్నించడంతో గొడవ జరిగింది. వివాదం ముదరడంతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి.
Also Read: Lord Krishna House: బయటపడ్డ ఐదు వేల ఏళ్లనాటి శ్రీకృష్ణుడి ఇల్లు..
దీంతో కొందరికి గాయాలు అయ్యాయి. తక్షణమే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపచేశారు. స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాల్సి ఉన్నా ఒక వర్గం వారు చేసే దురాగాతాలతో గొడవలు రేగాయి. కావాలనే దురుద్దేశంతో వారు చేసే దుర్మార్గాన్ని ప్రశ్నించడంతో యువకులపై కత్తులతో దాడికి తెగబడటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో శివమొగ్గలో చోటుచేసుకున్న గొడవలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఊళ్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో గొడవలు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు.
దీంతో ఊరు మొత్తంలో దుకాణాలు మూసివేయించారు. బంద్ పాటిస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏం జరుగుతుందోననే భయం నెలకొంది. దీనిపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ గొడవలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. శివమొగ్గలో పూర్వపు స్థితి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ కారణంగా ఊరు మొత్తం హడలిపోతోంది.