Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 5 Telugu: ఆ విషయంలో నాన్నని మోసం చేశా... ఎమోషనల్ అయిన ప్రియాంకా...

Bigg Boss 5 Telugu: ఆ విషయంలో నాన్నని మోసం చేశా… ఎమోషనల్ అయిన ప్రియాంకా సింగ్..

Bigg Boss 5 Telugu: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. సెలబ్రిటీల మధ్య జరిగే ఉత్కంఠ భరిత సంభాషణ… డ్రామాను తలపిస్తుంది. అదే బిగ్ బాస్ సీజన్ 5. ఆదివారం ఎంతో అంగరంగ వైభవంగా 19 మంది సభ్యులతో మొదలైన ఈ షోలో ఈసారి చాలా మంది కొత్త వాళ్ళు కనిపించారు. ఎంతో ఉత్సహంగా హౌజ్ లోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు… తమ తమ ఆటను మొదలు పెట్టడంలో నిమగ్నం అయినట్టే కనిపిస్తోంది. మొదటి రోజే తన […]

Bigg Boss 5 TeluguBigg Boss 5 Telugu: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. సెలబ్రిటీల మధ్య జరిగే ఉత్కంఠ భరిత సంభాషణ… డ్రామాను తలపిస్తుంది. అదే బిగ్ బాస్ సీజన్ 5. ఆదివారం ఎంతో అంగరంగ వైభవంగా 19 మంది సభ్యులతో మొదలైన ఈ షోలో ఈసారి చాలా మంది కొత్త వాళ్ళు కనిపించారు. ఎంతో ఉత్సహంగా హౌజ్ లోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు… తమ తమ ఆటను మొదలు పెట్టడంలో నిమగ్నం అయినట్టే కనిపిస్తోంది. మొదటి రోజే తన గురకతో … హౌజ్ మేట్స్ కి నిద్ర లేకుండా చేసి.. ప్రేక్షుకుల్లో నవ్వులు తెప్పించారు కంటెస్టెంట్ లోబో. బోర్ కొడుతుందంటూ.. సిరి, జేస్సీలు ఇంట్లో వాళ్ళ వస్తువులు దాచేస్తారు.

ఇకపోతే… ఇంట్లోకి అడుగుపెట్టిన మరో సెలబ్రెటీ ప్రియాంకా సింగ్.. తాను ట్రాన్స్ జెండర్ గా మారిన విషయాన్ని పంచుకున్నారు. ఆ విషయం తన తండ్రికి తెలియకుండా.. 3 సంవత్సరాలుగా తనను మోసం చేశానని వాపోయారు. ఇదే విషయాన్ని తనను ఇంట్లోకి ఆహ్వానించే సమయంలో… బిగ్ బాస్ వేదికపై వాళ్ల నాన్నకు చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని హౌస్ లో మరోసారి తోటి కంటెస్టెంట్ కాజల్ తో ముచ్చటిస్తూ ఎమోషనల్ అయ్యారు.తన తండ్రికి తెలియకుండా ఈ సర్జరీ చేయించుకున్నానని అయితే ఒకరోజు తన తండ్రి నీ మీసం గడ్డం ఏదిరా అని అడిగినప్పుడు ఒక లేడీ గెటప్ కోసం వాటిని తొలగించాను నాన్నా అంటూ చెప్పుకొచ్చానని, ఇన్ని రోజులుగా దాచిన ఈ నిజాన్ని నాన్నకు చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక మంచివేదిక కావటంతో బిగ్ బాస్ వేదికపై తన తండ్రికి ఈ విషయాన్ని తెలియజేశానంటూ కాజల్ తో చెప్పుకొని ప్రియాంక సింగ్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోని కాజల్ ప్రియాంక సింగ్ ఓదార్చారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper