https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్ లో ఈ ఇద్దరు

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ యమరంజుగా సాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 19మందిని హౌస్ లోకి పంపడంతో రచ్చరచ్చ కొనసాగుతోంది. అశేష ప్రేక్షకాదరణతో షో సూపర్ డూపర్ గా నడుస్తోంది. ఐదో సీజన్ లో గొడవలు, కొట్లాటలు, తిట్టుకోవడాలు ఎక్కువై పోయి ప్రేక్షకులకు రంజుగా మారింది. తొలి వారం బూతులతో రెచ్చిపోయిన ‘సరయు’ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో కూడా ఏకంగా ఏడుగురు నామినేషన్ లో ఉన్నారు. ఆర్జే కాజల్, […]

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2021 / 12:30 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ యమరంజుగా సాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 19మందిని హౌస్ లోకి పంపడంతో రచ్చరచ్చ కొనసాగుతోంది. అశేష ప్రేక్షకాదరణతో షో సూపర్ డూపర్ గా నడుస్తోంది. ఐదో సీజన్ లో గొడవలు, కొట్లాటలు, తిట్టుకోవడాలు ఎక్కువై పోయి ప్రేక్షకులకు రంజుగా మారింది.

    తొలి వారం బూతులతో రెచ్చిపోయిన ‘సరయు’ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో కూడా ఏకంగా ఏడుగురు నామినేషన్ లో ఉన్నారు. ఆర్జే కాజల్, లోబో, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, ప్రియ, ప్రియాంకసింగ్, ఆనీ మాస్టర్ లు నామినేట్ అయ్యారు. వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. రెండో వారంలో నామినేట్ అయిన సభ్యులు కొందరు శృతి మించి గొడవకు దిగి ప్రేక్షకుల దృష్టిలో పలుచన అయ్యారు.

    ముఖ్యంగా ఈ అందరిలోకి బూతులతో రెచ్చిపోతూ ఇంట్లో రచ్చ చేస్తున్న సీనియర్ నటి ఉమాదేవికి ఈ వారం ఎఫెక్ట్ అవుతోందని తెలుస్తోంది. అసభ్యపదజాలంతో ఎదుటి వాళ్లను ఉమాదేవి దూషించిన తీరును కంటెస్టెంట్లు, ప్రేక్షకులు తప్పుపడుతున్నారు. ఆమె ప్రవర్తన చూసిన వాళ్లంతా రెండో వారంలో ఇంటినుంచి బయటకు వెళ్లేది ఉమాదేవినే అని స్పష్టం చేస్తున్నారు. పైగా ట్రెండ్స్ ను బట్టి చూస్తుంటే రెండో వారంలో తక్కువ ఓట్లు ఈమెకే వచ్చాయట..

    ఇప్పటికే చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో ‘ఉమాదేవి’ తీరును ఎండగడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆమెను ఎలిమినేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    రెండో వారం ఓటింగ్ ప్రక్రియలో బిగ్ ట్విస్ట్ నెలకొందట.. తరచుగా కంటెస్టెంట్ల ఓటింగ్ మార్పులు జరుగుతున్నాయట.. డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు పైకి కిందకు వస్తున్నారు. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.

    మొత్తం పోలింగ్ లో ప్రస్తుతం టాప్ లో లోబో, ప్రియలు ఉన్నారు. వీళ్లద్దరి తర్వాత ప్రియాంకసింగ్ కొనసాగుతోంది. వీరు ముగ్గురు సేఫ్ అంటున్నారు. ఈ వారం ఆనీమాస్టర్, నటరాజ్ మాస్టర్, ఉమాదేవిలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు చెబుతున్నారు. ఆనీ, నటరాజ్ లకు బయట ఫాలోయింగ్ లేకపోవడం మైనస్ అంటున్నారు. వీళ్లు వెనకబడినట్లు తెలుస్తోంది. ఇక ఉమాదేవి ప్రవర్తన కూడా మైనస్ అంటున్నారు. వీరి ముగ్గురిలో నటరాజ్, ఆనీలకే ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. ఉమాదేవి కూడా ఎలిమినేట్ అవ్వొచ్చని అంటున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..