ఈలోగా ఏసీపీ రోషిణి రావడంతో..ఏసీపీ రోషిణితో మోనిత తనకు ఒక కోరిక ఉందంటూ.. ఆ కోరిక తీర్చాలని అడుగుతుంది. తనని కోర్టుకు రోషిణి కారులో తీసుకు వెళ్లాలని చెప్పడంతో రోషిణి ఆగ్రహంతో ఊగిపోతూ.. నేను ఖైదీలను ఎక్కించుకోను అని గట్టిగా చెప్పిన కూడా మోనిత రోషిణిని బ్రతిమిలాడి, విసిగించి చివరికి తన కారులోనే కోర్టుకు బయలుదేరుతుంది. ఇక దీప ఇంట్లో పిల్లలు మెట్లపై కూర్చుని అమ్మ నాన్న ఎక్కడికి వెళ్తున్నారు.. మనతో అబద్ధం చెప్పి వీళ్లు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ప్రశ్నల పై ప్రశ్నలు వేసుకుంటూ ఉండగా అంతలో అక్కడికి సౌందర్య, కార్తీక్, దీప వస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు మేము కూడా మీతో వస్తామని సౌర్య అనడంతో వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు కార్తీక్.
ఇక వీరు బయలుదేరుతుండగా సౌర్య కార్తీక్ చేయి పట్టుకొని మరి ఇంటికి తిరిగి వస్తావా నాన్న.. నువ్వు బయటకు వెళ్తుంటే భయం వేస్తుంది. మళ్లీ ఇంటికి తిరిగి వస్తావు కదా అంటూ కార్తీక్ తో అనడంతో కార్తీక్ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కోర్టుకు బయలుదేరుతారు. ఇక కోర్టుకు ఏసిపి కారులో బయలుదేరిన మోనిత మనసులో ఈ ఏసీపీకి రెండు బిస్కెట్లు వేస్తామని అనుకొని మాట్లాడగా.. వెంటనే రోషిణి ఇంకెన్ని బిస్కెట్లు తీసుకొచ్చావని అనడంతో.. మోనిత షాక్ అవుతుంది. మోనితకి బాగా వార్నింగ్ ఇచ్చి తన ఓవరాక్షన్ అంతటితో ఆపుతుంది. అలాగే దీప కార్తీక్ ను పొగుడుతూ మాట్లాడటం వల్ల మోనిత మండిపడుతుంది.
మోనిత ఇలా ఏసిపి కారులో కోర్టుకు వెళ్లడం చూసిన దీప, కార్తీక్ షాక్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ చేసింది. ఇక కోర్టులో దీప, సౌందర్య, కార్తీక్ మోనిత నిజ స్వరూపం గురించి మాట్లాడుతున్న సమయంలో అక్కడికి మోనిత వెళుతుంది. సౌందర్యాను చూసిన మోనిత వెటకారంగా మాట్లాడటంతో సౌందర్య తనపై చేయి ఎత్తుతుంది. ఈ క్రమంలోనే ఏసిపి రోషిని సౌందర్యాన్ని కూల్ చేస్తూ ఇందాక నేను పెట్టిన గడ్డి సరిపోలేదా.. ఇప్పుడు ఇక్కడ కూడా నీకు గడ్డి కావాలా.. అంటూ రోషిని మోనితను అనడంతో దీప, కార్తీక్ నవ్వుకుంటారు.అయితే ఆ తర్వాత కోర్టులో ఏం జరుగుతుంది ఈ సీరియల్ ఎటువైపు దారి తీస్తుందో అనేది తెలియాలంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.