https://oktelugu.com/

Science-Fiction Movies : హాలీవుడే కాదు టాలీవుడ్ కూడా గ్రేట్ !

Science-Fiction Movies: తెలుగు సినీ చరిత్ర మొదట్లో కొన్ని సైన్స్ ఫిక్షన్ చిత్రాలు వచ్చాయి. చాలామంది ‘ఆదిత్య 369’ సినిమానే మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకుంటారు. కానీ, ఈ సినిమాకి ముందే కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు వచ్చాయి. 1969లో “శభాష్‌ సత్యం” అనే సినిమా వచ్చింది. కృష్ణ, రాజశ్రీలు హీరోహీరోయిన్లు. హీరో తన సైంటిస్ట్ మేనమామ ప్రభాకర రెడ్డి కనిపెట్టిన ఒక ద్రవాన్ని తాగుతాడు హీరో. దాని ఫలితంగా రూపం కోల్పోయి అదృశ్య వ్యక్తిగా […]

Written By:
  • admin
  • , Updated On : September 17, 2021 / 12:35 PM IST
    Follow us on

    Science-Fiction Movies: తెలుగు సినీ చరిత్ర మొదట్లో కొన్ని సైన్స్ ఫిక్షన్ చిత్రాలు వచ్చాయి. చాలామంది ‘ఆదిత్య 369’ సినిమానే మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకుంటారు. కానీ, ఈ సినిమాకి ముందే కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు వచ్చాయి. 1969లో “శభాష్‌ సత్యం” అనే సినిమా వచ్చింది. కృష్ణ, రాజశ్రీలు హీరోహీరోయిన్లు. హీరో తన సైంటిస్ట్ మేనమామ ప్రభాకర రెడ్డి కనిపెట్టిన ఒక ద్రవాన్ని తాగుతాడు హీరో. దాని ఫలితంగా రూపం కోల్పోయి అదృశ్య వ్యక్తిగా చలామణీ అవుతాడు.

    ఈ అవకాశాన్ని కైకాల సత్యనారాయణ బాగా వాడుకుని అనేక నేరాలు చేసి వాటిని సత్యం పై నెట్టేస్తాడు. చివరలో సత్యం తిరిగి ఆ సైంటిస్ట్ తయారు చేసిన మరో ద్రవాన్ని త్రాగి తన యధా రూపాన్ని మళ్ళీ పొంది నేరస్థుడిని పట్టిస్తాడు. ఇక 1965 లో వచ్చిన “దొరికితే దొంగలు“ సినిమా కూడా సైన్స్ ఫిక్షన్ జోనర్ లోనే ఉంటుంది. ఎన్టీఆర్, జమునలు హీరోహీరోయిన్స్. హీరోయిన్ తండ్రి ధూళిపాళ పసర్లతో ప్రయోగాలు చేస్తూ కాకతాళీయంగా తయారైన ఓ పసరు కాళ్లకు పూసుకుంటే గాలిలో ఎగురుతారు.

    1957లో వచ్చిన మాయాబజారు సినిమాను కూడా అప్పటి కాలంతో బేరీజు వేస్తే సైన్స్‌ ఫిక్షన్‌ అనొచ్చు. కార్డ్‌లెస్‌ ల్యాప్‌టాప్‌, ఫేస్‌టైం మరియు ఫేస్‌ రీడింగ్ లను ఆ రోజుల్లోనే చూపించిన సినిమా ఇది. ఇక జార్జ్‌ లుకాస్‌, స్టీవెన్‌ స్పీల్‌ బర్గ్‌లు సృష్టించిన కొన్ని రకాల రోబో పాత్రలను మరియు ఫిక్షన్‌ పాత్రల్లాంటివి మన విఠలాచార్య ఎప్పుడో ఆ రోజుల్లోనే తీసి చూపించాడు.

    ఉదాహరణకు 1981లో వచ్చిన హాలీవుడ్‌ సినిమా “ఇండీయానా జోన్స్‌”. ఈ సినిమాలో ఎన్నో సన్నివేశాలను, 1967లోనే విఠలాచార్య “చిక్కడు దొరకడు” అనే సినిమాలో తీశాడు. కానీ సైన్స్ ఫిక్షన్ అనగానే హాలీవుడ్ సినిమాలే గుర్తుకు వస్తాయి. కానీ ఆలోచనల పరంగా నిజమైన సైన్స్ ఫిక్షన్ సినిమాలను మనవాళ్ళు ఎప్పుడో తీశారు. కాబట్టి ఈ జోనర్ సినిమాల హాలీవుడే కాదు టాలీవుడ్ కూడా గ్రేట్.