బిగ్ బాస్ నాలుగో సీజన్ గత మూడు సీజన్ల కంటే భిన్నంగా కొనసాగుతోంది. తెలుగు రియల్టీ షోలలో నెంబర్ వన్ కొనసాగుతున్న బిగ్ బాస్ కు ఈ నాలుగో సీజన్ మాత్రం పెద్దగా కలిసి రాలేదనే టాక్ విన్పిస్తోంది. ఈ సీజన్లలో హౌస్ లో చెప్పుకోదగ్గ సెలబ్రెటీలు ఎవరూ లేకపోవడంతో బిగ్ బాస్ అభిమానులు షోపై పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. దీంతో టీఆర్పీ రోజురోజుకు పడిపోతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
బిగ్ బాస్-4లో ఎలిమినేషన్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రేక్షకుల ఓటింగులను బిగ్ బాస్ లెక్కలోకి తీసుకోకుండా ఎలిమినేషన్ చేస్తుండటంపై పలువురు మండిపడుతున్నారు. ఇంత మాత్రానికి ఓటింగ్ ఎందుకు పెడుతున్నారంటూ అభిమానులు నిలదీస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ నాలుగో సీజన్ 9వ వారంలో కొనసాగుతోంది. గత రెండ్రోజులుగా నామినేషన్ల ప్రక్రియ సాగుతోంది.
Also Read: సినిమా రివ్యూ: ‘మిస్ ఇండియా’ టాక్ ఏంటంటే?
సోమ, మంగళవారాల్లో కంటెస్టుల నామినేషన్ల ప్రక్రియలో కోడిగుడ్ల మోతమోగింది. అయితే హౌస్ లో కొందరు జట్టుగా ఏర్పడి మిగతా వారిని నామినేట్ చేస్తుండటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో నోయల్ ఉన్నప్పుడు సపరేట్ బ్యాచ్ ఎలా ఉందో ప్రస్తుతం అలానే కొనసాగుతోంది. లాస్య.. అభిజిత్.. హారిక, మొనాల్ ఒకే తీరులో గేమ్ ఆడుతున్నారు.
9వ వారంలో వీరంతా ఒకేలా నామినేషన్ చేశారు. అభిజిత్.. మోనాల్.. హారిక, లాస్య ఒకే తీరులో ఆలోచించి నామినేట్ చేయడంపై మరోసారి వైరల్ అయింది. అమ్మరాజశేఖర్.. అవినాష్ లను ఈ నలుగురు టార్గెట్ చేస్తున్నట్లు కన్పించింది. దీంతో వీరద్దరూ కూడా ఈ బ్యాచ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: డైహార్ట్ ఫ్యాన్ కోరిక తీర్చిన ఎన్టీఆర్