దుబ్బాకలో టీఆర్‌‌ఎస్‌ నేతలే బీజేపీకి మేలు చేశారా?

గత ఆరేళ్లలో తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గులాబీ పార్టీ గుభాళించేది. ఏ ఎన్నికల్లో ఎంత మెజార్టీ వస్తుందా అనే విషయంపైనే చర్చ జరుగుతుండేది. ఆ స్థాయిలో వన్‌సైడ్‌ అన్నట్లుగానే ఎన్నికలు జరిగేవి. కానీ.. అదేంటో దుబ్బాక ఉప ఎన్నికలో మాత్రం అధికార పార్టీ పరిస్థితి సీన్‌ రివర్స్‌లా మారింది. అసలు గట్టెక్కుతామా అనే ప్రశ్న టీఆర్‌‌ఎస్‌ పార్టీ నేతల్లోనే కనిపిస్తోంది. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌ చేసిన […]

Written By: NARESH, Updated On : November 4, 2020 11:21 am
Follow us on

గత ఆరేళ్లలో తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గులాబీ పార్టీ గుభాళించేది. ఏ ఎన్నికల్లో ఎంత మెజార్టీ వస్తుందా అనే విషయంపైనే చర్చ జరుగుతుండేది. ఆ స్థాయిలో వన్‌సైడ్‌ అన్నట్లుగానే ఎన్నికలు జరిగేవి. కానీ.. అదేంటో దుబ్బాక ఉప ఎన్నికలో మాత్రం అధికార పార్టీ పరిస్థితి సీన్‌ రివర్స్‌లా మారింది. అసలు గట్టెక్కుతామా అనే ప్రశ్న టీఆర్‌‌ఎస్‌ పార్టీ నేతల్లోనే కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌ చేసిన రాజకీయం తనకే మైనస్‌లా తయారైందంటూ పలువురి టాక్‌. ఏ ఎన్నిక ప్రచారంలో అయినా తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధినో.. తమ పార్టీ ఎజెండానో చెప్పుకోవాలి. కానీ.. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌‌ఎస్‌ లీడర్లు మాత్రం బీజేపీ జపం చేశారు. ఎంతసేపు ప్రచారంలో బీజేపీని ఎత్తి చూపడమే తప్ప తమ అభివృద్ధిని మాత్రం చెప్పుకోలేకపోయింది. దీంతో బీజేపీకి అదే ప్లస్‌ అయింది.

Also Read: హైదరాబాద్ అందుకే మునిగింది? ముంపుకు కారకులెవరు?

టీఆర్‌‌ఎస్‌ ఈ ఉప ఎన్నికలో ముఖ్యంగా బీజేపీని.. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావును టార్గెట్‌ చేసింది. ఇదే అక్కడి ప్రజల్లో చర్చకు దారితీసింది. హరీష్ రావు మొత్తంగా బీజేపీని ప్రజల్లో బ్యాడ్ చేద్దామనుకునుని విస్తృతంగా విద్యుత్ మీటర్లు.. పథకాల్లో కేంద్ర నిధులు .. వ్యవసాయ బిల్లులు అంటూ చెప్పుకొచ్చారు. కానీ.. అవి బీజేపీ గురించి ప్రజల్లో మరింత చర్చ జరగడానికి కారణమయ్యాయి తప్పితే ఆ పార్టీకి ఎక్కడా వ్యతిరేకతను తెచ్చిపెట్టలేదు. పోలింగ్ సరళిని బట్టి చూసిన విశ్లేషకులు సైతం ఇదే చెబుతున్నారు.

Also Read: దుబ్బాకలో బీజేపీ వేవ్.. గెలిచేస్తోందా?

అయితే.. పోలింగ్‌ ముగిశాక మీడియా ముందుకు వచ్చిన మంత్రి హరీష్‌ రావు కూడా కాస్త నైరాశ్యంలో ఉన్నట్టుగానే కనిపించింది. బీజేపీ చివరి వరకూ తప్పుడు ప్రచారం చేసిందని.. కాంగ్రెస్‌ అభ్యర్థి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ఫేక్ న్యూస్‌ క్రియేట్ చేయడం పరాకాష్ట అని మండిపడ్డారు. బీజేపీ గెలిచిపోయిందంటూ తప్పుడు వాయిస్ కాల్స్‌ పంపుతూ.. ప్రజలను అయోమయంలో పడేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మామూలుగా అయితే టీఆర్ఎస్‌లో ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత జోష్ కనిపించాలి. తెలంగాణ భవన్ ముందు పటాసులు పేల్చాలి. కానీ ఈ సారి మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఫైనల్‌గా బీజేపీ జపం చేసి ఆ పార్టీకి మేలు చేశామనే ఫీలింగ్‌ అయితే ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.