https://oktelugu.com/

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో గుంటూరు జిల్లాలో 66 వైద్యాధికారుల ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు నిన్న నోటిఫికేషన్ విడుదల కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గుంటూరు జిల్లా పాలనాధికారి ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. Also Read: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 16, 2020 11:20 am
    Follow us on

    Medical officers Jobs In AP
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో గుంటూరు జిల్లాలో 66 వైద్యాధికారుల ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు నిన్న నోటిఫికేషన్ విడుదల కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గుంటూరు జిల్లా పాలనాధికారి ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

    Also Read: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన గూగుల్.. ఇకపై మూడు రోజులే..?

    వైద్యారోగ్య శాఖ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. https://guntur.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎంబీబీఎస్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 42 సంవత్సరాల వయస్సులోపు అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు..?

    అయితే రిజర్వేషన్లను బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఆఫ్ లైన్ విధానంలో మాత్రమే వైద్యాధికారుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు గుంటూరు మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అడ్రస్ కు దరఖాస్తులను పంపాలి. మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మెడిసిన్ పూర్తి చేసిన వారికి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

    మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

    దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు భారీ వేతనం పొందే అవకాశం ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.