https://oktelugu.com/

చిరంజీవి  న్యూ లుక్ అదిరింది…

‘కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి.. ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ’ అని ఓ పాటలో  అంటారు చిరంజీవి.  కొత్త సినిమా కోసం తన రూపాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవడంలో అతడికి అతడే సాటి అని అందరికి తెలిసిన విషయమే. సినిమాలో పాత్రకోసం తప్పని సరిగా బరువు పెరగడం..తగ్గడంతో పాటు న్యూ లుక్ లో కూడా ప్రేక్షకులకి కనువిందు చేసేందుకు తమ బాడీని ఛేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా న్యూ లుక్ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2020 / 04:10 PM IST
    Follow us on

    ‘కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి.. ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ’ అని ఓ పాటలో  అంటారు చిరంజీవి.  కొత్త సినిమా కోసం తన రూపాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవడంలో అతడికి అతడే సాటి అని అందరికి తెలిసిన విషయమే. సినిమాలో పాత్రకోసం తప్పని సరిగా బరువు పెరగడం..తగ్గడంతో పాటు న్యూ లుక్ లో కూడా ప్రేక్షకులకి కనువిందు చేసేందుకు తమ బాడీని ఛేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా న్యూ లుక్ లో మెరిసి వీక్షకులని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Also Read: బిగ్ బాస్-4: అభిజిత్ సీక్రెట్ రిలీవ్ చేసిన తల్లి.. ఆటడేసుకున్న కంటెస్టెంట్స్..!

    మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ సమ‌యంలో వెరైటీ లుక్స్  ని ట్రై చేశాడు. గుండుతో అర్బ‌న్ మాంక్ లో క‌నిపించిన ఫొటో  సోషల్ మీడియాలో  వైర‌ల్ అయింది. ఎప్పుడూ క‌నిపించ‌ని విధంగా డిఫ‌రెంట్ గా క‌నిపించ‌డంతో చిరు..త‌న కొత్త చిత్రం ఆచార్య కోసం ఇలా రెడీ అయ్యాడు అని మెగా ప్యాన్స్ అనుకున్నారు. కాని వేదాళ‌మ్ రీమేక్ కోసం చేసిన ట్ర‌య‌ల్ లుక్ షూట్ అని చెప్పాడు. ఇప్పుడు  తాజాగా మరో  సరికొత్త లుక్‌లో క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఈ లుక్ లో సూపర్ గ్లామర్ తో కనిపించాడు చిరంజీవి.

    తాజాగా సమంత ‘ఆహా’ కోసం నిర్వహిస్తున్న టాక్ షో ‘సామ్ జామ్’కు అతిథిగా వచ్చిన సందర్భంగా చిరు చేసిన ఫొటో షూట్ తాలూకు పిక్స్ బయటికి వచ్చాయి. అందులో చిరును చూసి అందరూ షాకైపోయారు. టాప్ టు బాటమ్ ఆయనలో ఒక ఆకర్షణ కనిపిస్తోంది. ఓవరాల్‌గా లుక్ చాలా బాగుందనే ఫీడ్ బ్యాక్ అందరిలోనూ వచ్చింది. కెమెరా అంటే చిరులో ఎంత ఉత్సాహం వస్తుందో.. ఎలా లుక్‌ను ఆకర్షణీయంగా మార్చుకుంటారో మరోసారి రుజువైంది.

    Also Read: ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మూడు కథలను సిద్ధం చేశాడా?

    పదేళ్ల పాటు చిరు సినిమాలకు దూరంగా ఉన్న ఫీలింగ్ ఎంతమాత్రం కలగలేదు. చివరగా ‘శంకర్ దాదా జిందాబాద్’లో ఎంత ఆకర్షణీయంగా కనిపించారో.. రీఎంట్రీ మూవీలో అంతే అట్రాక్టివ్‌గా కనిపించారు. మధ్యలో ‘సైరా’ కోసం లుక్ మార్చుకుని విభిన్నంగా కనిపించిన చిరు.. మళ్లీ ‘ఆచార్య’ కోసం అవతారం మార్చుకున్నారు

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్