
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఐదో సీజన్ ఎంత ఘనంగా ప్రారంభమైందో తెలిసిందే. ఆడియన్స్ కు తెలిసిన వాళ్లు కొందరు.. తెలియనివాళ్లు మరికొందరు ఇలా.. మిక్స్డ్ కంటిస్టెంట్స్ హౌజ్ లోకి ప్రవేశించారు. అయితే.. ఈ సారి ఎంట్రీ ఇచ్చిన వెంటనే నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్ బాస్. దీంతో.. వచ్చీరాగానే ఇదెక్కడ గోలరా బాబోయ్ అంటూ టెన్షన్ ఫీలయ్యారు కంటిస్టెంట్స్. ఎవరి పేరు నామినేట్ చేస్తారో చెప్పాలని అందరినీ అడగడంతో.. ఎవరికి వారు తమకు తోచిన వారి పేర్లు పెట్టేశారు. అయితే.. వారిలో ఎక్కువ మంది జెస్సీని సూచించారు.
ఏపీకి చెందిన జశ్వంత్ పడాలా అలియాస్ జెస్సీ.. మోడల్ గా ఎదిగాడు. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రవేశించాడు. అయితే.. ఎక్కువ మంది ఎలిమినేటర్ గా తనను సూచించడంతో.. భావోద్వేగానికి గురయ్యాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాంటి జశ్వంత్ ను.. బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ఓదార్చేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో జాగ్రత్తగా ఎలా ఉండాలో కూడా సూచించాడు.
‘‘మోడలింగ్ రంగం నుంచి బిగ్ బాస్ హౌజ్ లోకి నేను, అలీ రెజా తర్వాత వచ్చింది నువ్వే. మోడల్స్ అనేవాళ్లు ఎప్పుడూ ఏడవొద్దు. తమ యాటిడ్యూడ్ కోసం పోరాటం చేయాలి. ఇలా.. ఆరంభంలోనే నువ్వు ఏడిస్తే.. త్వరగానే హౌస్ నుంచి బయటకు వస్తావు. నీకు ఆల్ ది బెస్ట్’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు కౌశల్.
ఈ విధంగా.. జెస్సీని ఓదారుస్తూనే.. కర్తవ్య బోధ చేశాడు కౌశల్. గేమ్ ను ఛాలెంజ్ గా తీసుకోవాలని సూచించాడు. అయితే.. కౌశల్ సూచనలు జెస్సీకి అందే ఛాన్స్ లేదు. మరి, జెస్సీ మేల్కొని కౌశల్ చెప్పినట్టుగా పోరాడుతాడా? మధ్యలోనే బయటకు వచ్చేస్తాడా? అనేది చూడాలి.