
Bigg Boss 5 Telugu: ‘బిగ్ బాస్ 5’కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఈ షో లో ఈ సారి 19 మంది కంటెస్టెంట్ లు ఉన్నారు. వీళ్ళలో టాప్ కంటెస్టెంట్ లు గా కొందరు అప్పుడే తమ టాలెంట్ ను చూపిస్తుంటే.. మరికొందరు మాత్రం షోలో నెగిటివ్ పర్సన్స్ గా పేరు పడ్డారు. ఇంతకీ ఈ సీజన్ లో ఎవరు విన్ అవుతారు ? అంటూ ప్రేక్షకుల్లో చర్చ మొదలయ్యింది. మరి ఈ 19 మంది కంటెస్టెంట్ లలో కొందరికి గెలిచే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. వారెవరో చూద్దాం.
1.షణ్ముఖ్ జస్వంత్
షణ్ముక్ కి సోషల్ మీడియా చాలా ఫాలోయింగ్ ఉంది, తన వెబ్ సిరీస్ లతో జనాన్ని బాగా ఆకట్టుకున్నారు. ఈ ఫాలోయింగ్ తో షణ్ముక్ గెలిచే ఛాన్స్ ఉంది.
2.రవి
యాంకర్ రవి కూడా చాలా ఫాలోయర్స్ ఉన్నారు. రవి టెలివిజన్ రంగంలో మంచి యాంకర్ గా గుర్తింపు తీసుకున్నాడు. రవి కూడా గెలిచే ఛాన్స్ ఉంది.
3.RJ కాజల్
కాజల్ గేమ్ స్ట్రాటజీ చాలా బాగుంది. ఆమెకు బిగ్ బాస్ గేమ్ బాగా తెలుసు అని మిగిలిన కంటెస్టెంట్ లు కూడా అంటున్నారు. కాజల్ కి కూడా గెలిచే ఛాన్స్ ఉంది.
4.సరయు
సరయు.. బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చకపోవచ్చు. కానే సరయు కూడా తెలివితేటలు బాగా చూపిస్తోంది.
5.ప్రియాంక సింగ్
అబ్బాయి నుండి అమ్మాయి గా మారిన ప్రియాంక కొద్దిగా సింపతి వర్కౌట్ అయ్యేలా ఉంది.
6.ప్రియ గారు
తెలుగు ఆడియన్స్ కి బాగా తెలిసిన నటి. ప్రియ కూడా గెలిచే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా ఇప్పుడే ఫలానా వాళ్ళు గెలుస్తారు అని చెప్పడం కష్టమే.