https://oktelugu.com/

Bigg Boss 18: బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్న మహేష్ బాబు మరదలు..ఈ ఆదివారం ఎపిసోడ్ లో ట్విస్టులు మామూలుగా ఉండవు!

ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 17 సీజన్స్ ని ఈ రియాలిటీ షో బాలీవుడ్ లో పూర్తి చేసుకుందంటే ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆదివారం అనగా అక్టోబర్ 6 వ తేదీన బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా లాంచ్ అవ్వబోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 4, 2024 12:29 pm
    Bigg Boss 18

    Bigg Boss 18

    Follow us on

    Bigg Boss 18: ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్లకు, హీరోలకు, క్యారక్టర్ ఆర్టిస్టులకు మళ్ళీ కెరీర్ పరంగా పునర్జన్మని ఇస్తున్న షో ఏదైనా ఉందా అంటే అని బిగ్ బాస్ రియాలిటీ షో అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు షైన్ అయ్యారు. అంతే కాదు సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించిన వాళ్లకు కూడా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా సినీ ఇండస్ట్రీ లో అవకాశాలు దక్కాయి. మన తెలుగు లో మాత్రమే కాదు, ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా పెద్ద సెన్సేషనల్ హిట్. మన ఇండియా లో ఈ బిగ్ బాస్ రియాలిటీ షో మొదలైంది మొదటగా బాలీవుడ్ లోనే. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

    ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 17 సీజన్స్ ని ఈ రియాలిటీ షో బాలీవుడ్ లో పూర్తి చేసుకుందంటే ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆదివారం అనగా అక్టోబర్ 6 వ తేదీన బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా లాంచ్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు ప్రసారమైన 17 సీజన్స్ ఒక ఎత్తు, సీజన్ 18 మరో ఎత్తు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీ లో ఎన్నడూ అమలు చేయని కాన్సెప్ట్స్ ఈ సీజన్ లో పరిచయం చేయబోతున్నారట. అంతే కాదు ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ విషయం లో కూడా బిగ్ బాస్ టీం ఆచి తూచి అడుగులు వేస్తోంది. దాదాపుగా పాపులర్ సెలెబ్రిటీలనే ఈ షో కోసం తీసుకుంటున్నారు. వారిలో నమ్రత శిరోద్కర్ సోదరి, సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు శిల్ప శిరోద్కర్ కూడా ఈ ఆదివారం బిగ్ బాస్ హౌస్ లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతుంది. శిల్ప శిరోద్కర్ కూడా బాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్. ఈమె 1989 వ సంవత్సరం లో మిథున్ చక్రవర్తి హీరో గా నటించిన ‘భ్రష్టాచార్’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా నాలుగు హిందీ చిత్రాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.

    అవి కమర్షియల్ గా సూపర్ హిట్ అయినా, కాకపోయినా ఈమె డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఒకానొక దశలో ఈమె ఏడాదికి 10 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఆరోజుల్లో ఈమెకు హీరోయిన్ గా ఎంత డిమాండ్ ఉండేదో. తెలుగు లో ఈమె ‘బ్రహ్మ’ అనే చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఆ సినిమా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు వెళ్లిపోయిందో మన ఆడియన్స్ కి తెలియదు కానీ, సక్సెస్ అయ్యుంటే మాత్రం మన టాలీవుడ్ లో కూడా శిల్ప కి మంచి అవకాశాలు వచ్చేవి, ఇప్పుడు ఇన్నాళ్లకు ఆమె మళ్ళీ బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్ ని పలకరించబోతుంది. మరి ఆమె తన ప్రవర్తనతో ఎంత అభిమానం సంపాదించుకోబోతుందో చూడాలి.