https://oktelugu.com/

Prabhas Adipurush: ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ నుంచి బిగ్ అప్ డేట్

Prabhas Adipurush: మహాశివరాత్రి పురస్కరించుకుని ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది. సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. 2023, జనవరి 12న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్‌ మూవీ ఆదిపురుష్‌ కోసం ఇప్పుడు కేవలం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 3, 2022 / 10:30 AM IST
    Follow us on

    Prabhas Adipurush: మహాశివరాత్రి పురస్కరించుకుని ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది. సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. 2023, జనవరి 12న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

    Prabhas Adipurush

    ప్రభాస్‌ మూవీ ఆదిపురుష్‌ కోసం ఇప్పుడు కేవలం టాలీవుడ్‌ ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. కాగా డార్లింగ్ ప్ర‌భాస్ కాస్త నేషనల్ స్టార్ ప్రభాస్ గా మారేసరికి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌తో.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ ని పెంచుతూ పోతున్నాడు. పైగా దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ మైథలాజికల్ డ్రామా.

    Also Read:  జాతీయ రాజకీయాలపై ‘కేసీఆర్’ అసలు ప్లాన్ ఇదే!

    కాగా భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీస్తున్నారు. తెలుగు-హిందీ భాషల్లో సైమల్టేనియస్ గా షూట్ చేసి.. మరో 7 భాషల్లో డబ్బింగ్ చేస్తారు. ఏది ఏమైనా ప్రభాస్ సినిమా అంటే.. ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల టాలెంట్ కి గుర్తింపు అన్నట్టుగా భావిస్తున్నారు బాలీవుడ్ జనం.

    బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఓం రౌత్ తీస్తున్న ‘ఆదిపురుష్’ 70 శాతం షూటింగ్ పూర్తి అయింది, వచ్చే రెండు నెలల్లో ఈ సినిమాని దాదాపు ఫినిష్ చేయడానికి ప్రభాస్ ఈ సినిమాకి ఇప్పటికే బల్క్ డేట్స్ కేటాయించాడు.

    Also Read:  పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా హీరోనే!

     

    Tags