https://oktelugu.com/

Radhe Shyam: రాధేశ్యామ్​లో ఆ ఒక్క సీన్​ తీయడానికి సంవత్సరం పట్టిందట!

Radhe Shyam: రెబల్ స్టార్​ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్​ దర్శకత్వంలో పాన్​ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న చిత్రం రాధేశ్యామ్​. పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో 1970ల కాలంనాటి ఇటలీ బ్యాక్​ డ్రాప్​ కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్​ పతాకంపై వంశీ ప్రమోద్​- ప్రసీద సంయుక్తంగా భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్న సినిమా ఇది కాగా, మరో ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్​ అప్​డేట్​ వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్​ కోసం దాదాపు సంవత్సరం పాటు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 3, 2022 / 10:36 AM IST
    Follow us on

    Radhe Shyam: రెబల్ స్టార్​ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్​ దర్శకత్వంలో పాన్​ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న చిత్రం రాధేశ్యామ్​. పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో 1970ల కాలంనాటి ఇటలీ బ్యాక్​ డ్రాప్​ కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్​ పతాకంపై వంశీ ప్రమోద్​- ప్రసీద సంయుక్తంగా భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్న సినిమా ఇది కాగా, మరో ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్​ అప్​డేట్​ వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్​ కోసం దాదాపు సంవత్సరం పాటు పని చేసినట్లు ఈ మూవీ సినిమాటోగ్రాఫర్​ మనోజ్​ పరమహంస తెలిపారు. ఆ ఒక్క సీన్​ సినిమాకు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని దానికోసం తాను కూడా ఏడాది పాటు ఆలోచించినట్లు మనోజ్​ వెల్లడించారు. ఇలాంటి క్లైమాక్స్​ను అమలు చేయడం.. ప్రేక్షకులను ఒప్పించడం అంత సులువైన విషయం కాదని ఆయన అన్నారు. దీనిపై కంటిమీద కునుకు లేకుండా రీసెర్చ్ చేస్తూనే ఉన్నామని అన్నారు. క్లైమాక్స్​లో చాలా ఆసక్తికర విషయాలు చూపించబోతున్నట్లు మనోజ్​ తెలిపారు.

    కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 7 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధం చేస్తోంది చిత్రయూనిట్​. మరోవైపు, ఆదిపురుష్​లో నిటిస్తోన్న ప్రభాస్​.. ఇటీవలే షూటింగ్​ పూర్తి చేసుకుని సెలెబ్రేషన్స్​ కూడా జరుపుకున్నారు. రామాయణ కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఓం రౌత్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రావణుడిగా సైఫ్​ అలీఖాన్​, సీతగా కృతీసనన్​గా కనిపించనున్నారు. దీంతో పాటు, సలార్​ సినిమా కూడా చేస్తున్నారు ప్రభాస్​.