Pawan Kalyan Farmers: అధికార పార్టీకి మైండ్ బ్లాక్.. రైతులకు అండగా జనసేనాని

Pawan Kalyan Farmers: ఏదో సమావేశంలో అరగంట పాటు ఆయన ప్రసంగిస్తేనే రాజకీయాలు హీటెక్కిపోతాయి. అటువంటిది రోజుల వ్యవధి ప్రజల మధ్య, వారి సమస్యలపైనే మాటాడితే దిమ్మతిరిగిపొద్ది కదూ.. మైండ్ బ్లాక్ అయిపోతుంది కదూ..అదేనండి జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రైతు ఓదార్పు యాత్ర చేపడుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అధికార వైసీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నువ్వు రెండుచోట్ల ఓడిపోయావు. నీకు రాజకీయ పరిణితి లేదు. చంద్రబాబుకు బినామీ అంటూ అధికార పార్టీ మంత్రుల […]

Written By: Admin, Updated On : April 3, 2022 10:23 am
Follow us on

Pawan Kalyan Farmers: ఏదో సమావేశంలో అరగంట పాటు ఆయన ప్రసంగిస్తేనే రాజకీయాలు హీటెక్కిపోతాయి. అటువంటిది రోజుల వ్యవధి ప్రజల మధ్య, వారి సమస్యలపైనే మాటాడితే దిమ్మతిరిగిపొద్ది కదూ.. మైండ్ బ్లాక్ అయిపోతుంది కదూ..అదేనండి జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రైతు ఓదార్పు యాత్ర చేపడుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అధికార వైసీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నువ్వు రెండుచోట్ల ఓడిపోయావు. నీకు రాజకీయ పరిణితి లేదు. చంద్రబాబుకు బినామీ అంటూ అధికార పార్టీ మంత్రుల నుంచి కింది స్థాయి ఎమ్మెల్యేల వరకూ రకరకాల వ్యాఖ్యానాలు పవన్ చేస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పవన్ మీటింగులంటే ప్రభుత్వ పెద్దలకు కంగారే. ఆయన ఏం మాట్లాడుతారు? ఎవర్ని కడిగి పారేస్తారోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది. రాష్ట్రంలో సాగు గిట్టుబాటుకాక.. ప్రభుత్వ ప్రోత్సాహం లేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఓదార్చేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. ఈ యాత్రకు సంబంధించి సన్నాహాలు శర వేగంగా జరుగుతున్నాయి.

Pawan Kalyan

రూట్ మ్యాప్ సైతం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో అప్పుల బాధ తాళలేక వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలను ఓదార్చడం ద్వారా రైతులకు భరోసా ఇవ్వడానికి పవన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఓదార్పు యాత్ర చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. ఎందుకంటే ఇదే తరహా యాత్ర చేయడం ద్వారా జగన్ తిరుగులేని నేతగా ఎదిగారు. అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రాగలిగారు. అటువంటిది లక్షలాది మంది అభిమానించే పవన్ కల్యాణ్ రోడ్డుపైకి వస్తే జన ప్రభంజనం ఎలా ఉంటుందో ప్రభుత్వ పెద్దలకు తెలియంది కాదు. ఆయన పేల్చే రాజకీయ తూటాల గురించి తెలియంది కాదు. అందుకే పవన్ ఓదార్పు యాత్రపై జనసైనికులకు ఎంత ఆసక్తి ఉందో? ప్రభుత్వ పెద్దలకు, వైసీపీ నాయకులకు అంతే ఆసక్తి నెలకొంది.

Also Read: IPL 2022: ఐపీఎల్ మజా: గుజరాత్ కు ఎదురేది?

ఆర్థిక సాయం..ఆపై భరోసా
పంటకు గిట్టుబాటు ధర లేక… అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలని పవన్ ఓదార్చనున్నారు. అదే విధంగా కౌలుకు భూములు తీసుకుని నానా అవస్థలు పడుతూ ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను కూడా ఆయన పరామర్శించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా పవన్ ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల దాకా ఆర్ధిక సాయం కూడా చేయనున్నారు. నిజానికి ఇలా చేయడం వల్ల రైతులకు భరోసా వస్తుంది. వెంటనే ఎంతో కొంత ఆర్ధిక సాయం అందుతుంది.

Pawan Kalyan Farmers

ప్రభుత్వానికి కూడా హెచ్చరికగా ఉంటుంది. మొత్తానికి జనసేనాని అన్నీ ఆలోచించే జనంలోకి వస్తున్నారు.ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉభయ గోదావరి జిల్లాలోనే 75 మంది దాకా ఉంటే ఏపీ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నారని జనసేన నేతలు అంటున్నారు. వారిని అందరినీ పవన్ పలకరించబోతున్నారు. .పవన్ చేసే ఓదార్పు యాత్ర త్వరలో స్టార్ట్ కాబోతోంది. పవన్ పార్టీ పెట్టాక ఈ తరహా యాత్రలను షురూ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్న వేళ సమాజంలో అత్యంత ప్రభావిత రంగంగా ఉన్న రైతులకు ఆసరాగా ఉంటూ పవన్ చేసే ఓదార్పు యాత్ర జనసేన రాజకీయానికి మేలి మలుపుగా ఉంటుందని అంటున్నారు.

యాత్రలదే వైఎస్ కుటుంబానికి లబ్ధి
ఓదార్పు యాత్ర అంటే ముందుగా గుర్తుకొచ్చేది సీఎం జగన్ కుటుంబమే. 2004కు ముందు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవగలిగారు. తానూ ముఖ్యమంత్రి అయ్యారు. అటు ఆయన మరణానంతరం కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు బేఖాతరు చేసి కుమారుడు జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. వైఎస్ అకాల మరణం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో యాత్ర చేపట్టి తన నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు.

వైసీపీని స్థాపించి .. అవశేష ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసి అధికారంలోకి రాగలిగారు. తిరుగులేని విజయం సాధించారు. ఆయన సోదరి షర్మిళ ప్రస్తుతం తెలంగాణాలో యాత్ర చేపడుతున్నారు. తన కుటుంబానికి అచ్చొచ్చిన యాత్రతో తెలంగాణాలో రాజకీయంగా బలపడాలని భావిస్తున్నారు. ఒక విధంగా చెప్పాంటే ప్రజల్లో సెంటిమెంట్ రగల్చడం ద్వారా వైఎస్ఆర్ కుటుంబం రాజకీయ లబ్ధి పొందిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.

Also Read:Amaravati Capital Issue: అమరావతిపై మడత పేచీ.. వైసీపీ ప్రభుత్వం కొత్త పల్లవి

Tags