https://oktelugu.com/

Nandamuri Balakrishna :బిగ్ బ్రేకింగ్ : నందమూరి బాలకృష్ణ కి పద్మభూషణ్ అవార్డు..పూర్తి వివరాలు చూస్తే నందమూరి అభిమానులకు పండగే!

ఈ ఏడాది మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పద్మభూషణ్ అవార్డ్స్ కి గాను సినీ పరిశ్రమ నుండి నందమూరి బాలకృష్ణ ని ఎంపిక చేసి కేంద్రానికి పంపించారు. అలాగే ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ పేరుని కూడా సిఫార్సు చేసారు. ప్రస్తుతం టీడీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో మిత్ర పక్షంలో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : October 20, 2024 3:39 pm
    Nandamuri Balakrishna

    Nandamuri Balakrishna

    Follow us on

    Nandamuri Balakrishna : నందమూరి అభిమానులు త్వరలో ఒక అద్భుతమైన శుభ వార్త ని వినబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రతీ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా భారత దేశ ప్రభుత్వం తరుపున, రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మ’ పురస్కారాలు అందచేసే సంగతి మన అందరికీ తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తుల సేవలను గుర్తించి ఈ పురస్కారాలను ఇస్తూ ఉంటారు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డు దక్కిన సంగతి అందరికీ తెలిసిందే. అంతకుముందు ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది. అయితే పద్మ పురస్కారాలు స్వయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇచ్చేవి ఉంటాయి, అలాగే ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు సిఫార్సులను పరిగణించి ఇచ్చేవి కొన్ని ఉంటాయి.

    అలా ఈ ఏడాది మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పద్మభూషణ్ అవార్డ్స్ కి గాను సినీ పరిశ్రమ నుండి నందమూరి బాలకృష్ణ ని ఎంపిక చేసి కేంద్రానికి పంపించారు. అలాగే ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ పేరుని కూడా సిఫార్సు చేసారు. ప్రస్తుతం టీడీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో మిత్ర పక్షంలో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. కాబట్టి బాలయ్య బాబు కి పద్మభూషణ్  అవార్డు నూటికి నూరు శాతం ఖరారు అయ్యినట్టే. అన్ని విధాలుగా బాలయ్య బాబు పద్మవిభూషణ్ అవార్డుకి అర్హుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఆయన ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ పోషించాడు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా చేసాడు. కొన్ని పాత్రలు భారత దేశంలో బాలయ్య బాబు తప్ప ఎవ్వరూ చేయలేరు అనే విధమైన క్యారెక్టర్స్ ఎన్నో ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో కూడా ఆయన గొప్పగా రాణించాడు. ఒకసారి, రెండుసార్లు కాదు, ఏకంగా మూడు సార్లు ఆయన హిందూపురం స్థానం నుండి పోటీ చేసి ఎమ్మెల్యే గా ఎన్నిక అయ్యి, ఆ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించాడు. అంతే కాదు వైద్య రంగం ద్వారా కూడా ఆయన చేసిన సేవలు గుర్తించదగినవి.

    బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ని నడుపుతూ ఎన్ని వేల మందికి ఉచితంగా వైద్యం చేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలా వివిధ రంగాల్లో సేవలు అందించిన బాలయ్య కి పద్మవిభూషణ్ చాలా ఆలస్యంగా వచ్చిందని అభిమానులు ఫీలింగ్. అలాగే ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ కి కూడా పద్మభూషణ్ అవార్డు దాదాపుగా ఖరారు అయ్యినట్టే చెప్పాలి. ఇండస్ట్రీ లో సీనియర్ మోస్ట్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేసిన మురళీ మోహన్, రాజకీయాల్లో కూడా రాణించిన సంగతి అందరికీ తెలిసిందే. మంత్రిగా కూడా ఆయన పని చేస్తూ ఎన్నో సేవాకార్యక్రమాలు తలపెట్టాడు. తెలుగు దేశం పార్టీ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత ఆప్తులు అవ్వడంతో మురళీ మోహన్ పేరుని కూడా పంపించినట్టు తెలుస్తుంది. జనవరి 26 వ తారీఖున ఈ పురస్కారం వీళ్లిద్దరికీ రాష్ట్రపతి చేతుల మీదుగా అందనుంది.