https://oktelugu.com/

Yuvraj Singh : యువరాజ్ చెప్పిన ఆ సలహానే రోహిత్ శర్మ కెరీర్ ను మార్చి.. సక్సెస్ ఫుల్ క్రికెటర్‌గా తీర్చిదిద్దిందా?

క్రికెటర్ యువరాజ్ సింగ్ ‌పై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన రోహితే.. ఈ వ్యాఖ్యలు చేశారు. దాంతో క్రికెట్‌లో రోహిత్ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. తన కెరీర్‌లో యువరాజు వల్ల జరిగిన ఓ ఇన్సిడెంట్‌పై హిట్‌మ్యాన్ పంచుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 20, 2024 / 04:10 PM IST

    Yuvraj Singh - Rohith Sharma

    Follow us on

    Yuvraj Singh : రోహిత్ శర్మ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది టీ20 ప్రపంచ కప్ పోటీలు జరిగాయి. ఇందులో రోహిత్ కీలక ఇన్సింగ్స్‌లు ఆడగా.. ఆ తర్వాత ఫామ్ కోల్పోయాడు. దాంతో జట్టులో స్థానం కోల్పోయాడు. 2010లో అనూహ్యంగా రోహితో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తాజాగా.. న్యూజిలాండుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా ఆ వీడియో మరోసారి వైరల్ అయింది. ఇంతకీ.. ఆ ఇంటర్వ్యూ విశేషాలేంటి..? యువరాజ్‌పై రోహిత్ చేసిన ఆ ఆసక్తికర వ్యాఖ్యలేంటో ఒకసారి చూద్దాం.

    ఒకానొక టైంలో జట్టులో నేను స్థానం కోల్పోయాను. ఆ సమయంలో యువీ నాకు కీలక సూచనలు చేశాడు. ప్రతీ క్రికెటర్‌కు ఇలాంటి దశ తప్పకుండా కలుగుతుంది. ఎప్పుడు అవకాశం వచ్చినా ఆస్వాదించేందుకు సిద్ధంగానే ఉండాలి. అప్పుడు మానసికంగానూ ఎలాంటి ఇబ్బందులు రావు. అతడి మాటలే నన్ను ఇలా ముందుకు నడిపించాయి. నా బ్యాటింగులో కూడా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. యువీలా మరెవరూ నా ఆటకు సాయపడలేదు. ఫినిషనర్‌గా మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకొని ఆడాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రత్యర్థి కెప్టెగా ఆలోచించాలని యువీ సూచించారు. ఆ మాటలే నా కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపాయి’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

    అయితే.. 2011లో అనూహ్యంగా రోహిత్ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. దాంతో ఆ సమయంలో మానసికంగా ఎంతగానో కుంగిపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఆ తరువాత పుంజుకొని మరోసారి జట్టులో స్థానం సంపాదించాడు. హిట్‌మ్యాన్‌గా ఎదిగి మంచి బ్యాటర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. ఏకంగా కెప్టెన్ స్థాయికీ ఎదిగాడు. విరాట్ కోహ్లీ నుంచి జట్టు పగ్గాలను స్వీకరించి.. గతేడాది జట్టును ప్రపంచ కప్ ఫైనల్‌కు చేర్చాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌ను దేశానికి అందించాడు. ఇంకా ముందుముందు జరిగే చాంపియన్ షిప్ ట్రోఫీలను టార్గెట్ చేశాడు. అందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న టెస్ట్ చాంపియన్ షిప్, చాంపియన్ షిప్ ట్రోఫీలను సాధించమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు.

    రోహిత్ శర్మ ఇటీవల టీ20 వరల్డ్ కప్ సాధించిన వేళ పొట్టి ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ముందు ముందు మరిన్ని ఫార్మాట్ కప్‌లను టార్గెట్ చేసిన రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే సమయమూ దగ్గర పడినట్లుగా తెలుస్తున్నది. ఇప్పటికే ఐపీఎల్‌లో ముంబయి జట్టు సారథిగా ఉన్న రోహిత్‌ను కెప్టెన్ నుంచి తప్పించారు. గతేడాది జరిగిన ఐపీఎల్‌లో ఆయన నార్మల్ ఆటగాడిగానే కొనసాగాడు. అయితే.. ఈసారి జరిగే ఐపీఎల్‌లో ముంబయి జట్టును వీడుతారన్న ప్రచారం జరుగుతోంది.