https://oktelugu.com/

బిగ్ బాస్ ట్వీస్ట్.. కెప్టెన్ ఎలిమినేషన్.. ఇప్పుడెలా?

బిగ్ బాస్-4 గత సీజన్లకు భిన్నంగా కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ షోలో సెలబ్రెటీలు పెద్దగా లేకపోవడంతో ప్రారంభంలో బిగ్ బాస్ చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనిని గుర్తించిన బిగ్ బాస్ క్రమంగా అదిరిపోయే టాస్కులు పెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. దీంతో బిగ్ బాస్-4ను చూసేందుకు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ బిగ్‌బాస్-4 ప్రస్తుతం తొమ్మిదో వారంలో కొనసాగుతోంది. ఈ వారం ఎలిమినేషన్ పై ఇప్పటికే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2020 / 11:15 AM IST
    Follow us on

    బిగ్ బాస్-4 గత సీజన్లకు భిన్నంగా కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ షోలో సెలబ్రెటీలు పెద్దగా లేకపోవడంతో ప్రారంభంలో బిగ్ బాస్ చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనిని గుర్తించిన బిగ్ బాస్ క్రమంగా అదిరిపోయే టాస్కులు పెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. దీంతో బిగ్ బాస్-4ను చూసేందుకు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    బిగ్‌బాస్-4 ప్రస్తుతం తొమ్మిదో వారంలో కొనసాగుతోంది. ఈ వారం ఎలిమినేషన్ పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. అమ్మ రాజశేఖర్ ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అవుతాడనే సమాచారం లీకైంది. దీంతో ఈవారం బిగ్ బాస్ కెప్టెన్సీ దక్కించుకున్న అమ్మరాజశేఖర్ ఎలిమినేట్ అవడం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది.

    Also Read: ఓటీటీలో విడుదలైన థ్రిల్లర్స్ లో ఇదే బెస్ట్ చిత్రం

    బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కెప్టెన్ ను ఎలిమినేషన్ చేయలేదు. గతంలో కెప్టెన్ గా ఉన్న వ్యక్తి ఎలిమినేటైన సందర్భంగాలో బిగ్ బాస్ తన సీక్రెట్ రూంకు పిలిచి ఇంటిలోకి తీసుకొచ్చి ట్వీస్ట్ ఇచ్చిన సందర్భాలున్నాయి. అయితే అమ్మరాజశేఖర్ విషయంలో మాత్రం కొత్త సంప్రదాయానికి బిగ్ బాస్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ వారం కెప్టెన్సీ దక్కించుకున్న అమ్మ రాజశేఖర్ ను ఎలిమినేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

    గతవారమే అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా నోయల్ సీన్ బయటకు వెళ్లడంతో మాస్టర్ బతికిపోయాడు. ఇక తొమ్మిదో వారంలోనూ బలహీన కంటెస్టెంట్ గా మాస్టరే ఉండటంతో అతడి ఎలిమినేషన్ ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే అనుహ్యంగా అతడు ఈవారం కెప్టెన్సీ దక్కించుకోవడంతో సేఫ్ అయినట్లు కన్పించింది.

    Also Read: పాపం.. ‘భారతీయుడు 2’కి మరో సమస్య !

    అయితే కిందటివారమే అతడు ఎలిమినేషన్ నుంచి తప్పించుకోగా ఈసారి మాత్రం బిగ్ బాస్ అతడికి ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో అతడు ఎలిమినేషన్ అయితే కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలోనూ బిగ్ బాస్ అదిరిపోయే ట్వీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కొత్త కెప్టెన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే..!