https://oktelugu.com/

జోబైడెన్‌ తొలి ప్రసంగం.. ఏం వరాలిచ్చాడంటే?

ప్రపంచమంతా ఊపిరిబిగిబట్టి చూస్తున్న వేళ ఎంతో ఉత్కంఠ కౌంటింగ్ మధ్య చివరికి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయం సాధించారు‌. అధ్యక్షుడిగా ఎన్నికన తర్వాత బైడెన్‌ తొలిసారి తన సొంత రాష్ట్రం డెలావెర్‌‌లో ఏర్పాటు చేసిన డెమొక్రాట్ల విజయోత్సవ సభలో ఉద్వేగంగా మాట్లాడారు. అమెరికా ప్రజలు తమ భవిష్యత్‌ కోసం ఓటేశారని.. వారి విశ్వాసాన్ని నిలబెడుతూ.. దేశ ప్రతిష్టను మరింత పెంచేందుక కృషి చేస్తానని చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2020 / 11:09 AM IST
    Follow us on

    ప్రపంచమంతా ఊపిరిబిగిబట్టి చూస్తున్న వేళ ఎంతో ఉత్కంఠ కౌంటింగ్ మధ్య చివరికి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయం సాధించారు‌. అధ్యక్షుడిగా ఎన్నికన తర్వాత బైడెన్‌ తొలిసారి తన సొంత రాష్ట్రం డెలావెర్‌‌లో ఏర్పాటు చేసిన డెమొక్రాట్ల విజయోత్సవ సభలో ఉద్వేగంగా మాట్లాడారు. అమెరికా ప్రజలు తమ భవిష్యత్‌ కోసం ఓటేశారని.. వారి విశ్వాసాన్ని నిలబెడుతూ.. దేశ ప్రతిష్టను మరింత పెంచేందుక కృషి చేస్తానని చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

    ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలాహారిస్‌ అద్భుతమైన నాయకురాలని కొనియాడారు. తమ గెలుపు అమెరికన్ల విజయంగా అభివర్ణంచారు. తన గెలుపునకు సహకరించిన జీవిత భాగస్వామి జిల్‌ బైడెన్‌ సహా ఇతర కుటుంబ సభ్యులను బైడెన్‌ ప్రశంసించారు. ఎన్నికల్లో ఓడిన ట్రంప్‌ తమకు శత్రువేమీ కాదన్నారు. అమెరికా అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

    Also Read: తమిళ కలువ ‘కమల’.. అమెరికా ఉపాధ్యక్షురాలు ఎలా అయ్యింది?

    కరోనా నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటామని బైడెన్‌ హామీ ఇచ్చారు. ఇందుకు సోమవారం ఓ ప్రత్యేక కార్యదళాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అమెరికాలోని ప్రతీ కుటుంబం ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉంటామన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రయోజనాల కోసమే నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు. దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతామని చెప్పారు. అవసరమైతే రిపబ్లికన్లతో కలిసి సాగుతామన్నారు.

    Also Read: జోబైడెన్‌తో భారత్‌ లాభమా..? నష్టమా..?

    మరోవైపు.. వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్నికల్లో తన గెలుపు మహిళా లోకం సాధించిన విజయంగా అభివర్ణించారు. ‘అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళను కావచ్చు.. కానీ చివరి మహిలను కాదు’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. అధ్యక్ష పదవికి ఎన్నికైన బైడెన్‌ నిరంతరం అమెరికన్ల క్షేమం కోసమే ఆలోచిస్తారని చెప్పారు. తన తల్లి శ్యామలా గోపాలన్‌ అమెరికాకు వచ్చి కన్న కలలను కమల గుర్తుచేసుకున్నారు.