https://oktelugu.com/

Bigg Boss Telugu 8 Finale: టాప్ 3 గా నిల్చిన నబీల్ కి 15 వారాలకు వచ్చిన రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా..? పాపం అన్యాయం చేసారుగా!

వాస్తవానికి నబీల్ మొదటి 5 వారాల ఆట తీరుని చూస్తే, గౌతమ్ స్థానంలో అతనే నిలిచేవాడు. కానీ వైల్డ్ కార్డ్స్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. కేవలం గౌతమ్, నిఖిల్ మధ్యనే టైటిల్ రేస్ జరిగింది. నబీల్ మూడవ స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 16, 2024 / 07:14 AM IST
    Follow us on

    Bigg Boss Telugu 8:  ఎన్నో ట్విస్టులు, భావోద్వేగాలు, గొడవలు మధ్య సాగిన బిగ్ బాస్ సీజన్ 8 నిన్న గ్రాండ్ ఫినాలే తో ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. టైటిల్ విన్నర్ గా నిఖిల్ నిలబడగా, రన్నర్ గా గౌతమ్ నిలబడ్డాడు. ఇద్దరూ టైటిల్ విన్నర్ అయ్యేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న వాళ్ళే. కానీ నిఖిల్ మొదటి ఎపిసోడ్ నుండి ఉండడం వల్ల ఆయనకీ కాస్త మార్జిన్ వచ్చింది. జనాల దృష్టిలో ఇద్దరూ విన్నెర్స్ యే. అయితే గౌతమ్ సూట్ కేసు తీసుకొని ఉండుంటే చాలా బాగుండేది అని ఆయన అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి నబీల్ మొదటి 5 వారాల ఆట తీరుని చూస్తే, గౌతమ్ స్థానంలో అతనే నిలిచేవాడు. కానీ వైల్డ్ కార్డ్స్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. కేవలం గౌతమ్, నిఖిల్ మధ్యనే టైటిల్ రేస్ జరిగింది. నబీల్ మూడవ స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

    అయితే నబీల్ మూడవ స్థానంలో కూడా నిలుస్తాడని అనుకోలేదు. ఎందుకంటే సోషల్ మీడియా లో జరిగిన పోల్స్ ని బట్టీ చూస్తే ప్రేరణ మూడవ స్థానంలో ఉంది. నబీల్ నాల్గవ స్థానంలో ఉండేవాడు. కానీ ఆయనకీ సైలెంట్ ఓటింగ్ ఒక రేంజ్ లో ఉందని మొదటి నుండి విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. అది నిన్న నిజమైంది. ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి, కేవలం తన ఆట తీరుతో అశేష ప్రేక్షాభిమానం ని పొంది, ఈరోజు సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకొని మూడవ స్థానంలో నిలబడడం అనేది సాధారణమైన విషయం కాదు. నబీల్ కి అంతకు ముందు కూడా భారీగానే డబ్బులు వచ్చేవి, కానీ బిగ్ బాస్ ద్వారా గుర్తింపు కోసం ఆయన తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా కూడా ఒప్పుకొని వచ్చాడు. ఏ గుర్తింపు వస్తుందని ఆయన నమ్మాడో, ఆ గుర్తింపు అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చింది.

    టాలీవుడ్ కి నబీల్ అవసరం ఉంది. అతనిలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంది. దర్శక నిర్మాతలు ఈ సీజన్ ఎవరైనా చూసి ఉంటే నబీల్ కి కచ్చితంగా తమ సినిమాల్లో అవకాశం ఇస్తారు. ఇదంతా పక్కన పెడితే నబీల్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఆయనకు వారానికి రెండు లక్షల రూపాయిలను మాత్రమే ఆఫర్ చేశారట. 15 వారాలు ఉన్నాడు, 30 లక్షల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకొని వెళ్ళాడు. వాస్తవానికి నబీల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఆయన సంపాదన భారీ రేంజ్ లో ఉంటుంది. ఇదే మూడు నెలలు ఆయన తన ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్స్ మీద తన సమయాన్ని వెచ్చించి ఉండుంటే ఇంతకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ని సంపాదించేవాడు. కానీ డబ్బులైతే వచ్చేవి కానీ, ఈ రేంజ్ గుర్తింపు మాత్రం వచ్చేది కాదు. ఇక్కడి నుండి నబీల్ కొత్త జర్నీ మొదలు కాబోతుంది. ఆయన కెరీర్ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.