Bigg Boss 7 Telugu: ప్రియాంక, శోభా యాటిట్యూడ్ చూసి మా రక్తం మరిగిపోతుంది… భోలే చెల్లి స్ట్రాంగ్ వార్నింగ్!

మొదట్లోనే గమనించిన శివాజీ తన టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో జట్టుగా ఆడుతున్నారని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే ప్రియాంక-శోభా నామినేషన్స్ లో భోలే షావలిని టార్గెట్ చేసిన తీరు దారుణంగా ఉంది.

Written By: NARESH, Updated On : October 19, 2023 5:51 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: సీరియల్ బ్యాచ్ కి స్టార్ మా భరోసా ఇచ్చి పంపిందేమో కానీ యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. మొదట్లో పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసిన అమర్ దీప్ కి మొట్టికాయలు పడ్డాయి. జనాల్లో నెగిటివ్ అయ్యానని తెలుసుకుని తగ్గాడు. అప్పటి నుండి గేమ్ మీద ఫోకస్ పెట్టి కొంచెం మెరుగ్గా ఆడుతున్నాడు. అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక ఒక టీమ్ గా ఆడుతున్నారు. అందుకే వీరికి సీరియల్ బ్యాచ్ అని పేరు పడింది. వీరు ఒకరిని మరొకరు నామినేట్ చేయరు. ఏ విషయంలో కూడా వ్యతిరేకించరు. మద్దతుగా ఉంటారు.

ఇది మొదట్లోనే గమనించిన శివాజీ తన టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో జట్టుగా ఆడుతున్నారని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే ప్రియాంక-శోభా నామినేషన్స్ లో భోలే షావలిని టార్గెట్ చేసిన తీరు దారుణంగా ఉంది. బూతులు తిడుతున్నాడు. ఆట తీరు సరిగా లేదని కారణాలు చెప్పారు. బూతుల విషయానికి వస్తే… గతంలో ఓ టాస్క్ లో రతికా ఆలస్యం చేయడం కారణంగా పవర్ అస్త్ర రేసు నుండి అమర్ తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో అతడు బూతులు మాట్లాడాడు. అప్పుడు ప్రియాంక పక్కనే ఉంది.

మరి బూతులు మాట్లాడం నేరం అని ఆమె భావించినప్పుడు ఆ కారణం చెప్పి నామినేట్ ఎందుకు చేయలేదు. భోలేకు మాత్రం కామన్ సెన్స్ లేదన్నట్లు ప్రియాంక మాట్లాడింది. శోభా గట్టిగా నోరేసుకుపడిపోయింది. ప్రియాంక ఏకంగా థూ అంటూ భోలే ఎదుట ఊచింది. నామినేషన్స్ లో భోలే పట్ల ప్రియాంక, శోభా ప్రవర్తించిన తీరుకు భోలే తల్లి, చెల్లెలు ఆవేదన చెందారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో సీరియల్ బ్యాచ్ పై ఫైర్ అయ్యారు.

భోలే తల్లి మాట్లాడుతూ… నా కొడుకు మంచి వాడు. నలుగురి అన్నం పెట్టే గుణం ఉన్నవాడు. అలాంటి వాడిని అనకూడని మాటలు అన్నారు. భోలే అందరితో కలిసిపోవాలని అనుకుంటున్నారు. కానీ తనను దూరం పెడుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక భోలే చెల్లెలు మాట్లాడుతూ… నామినేషన్స్ రోజు మా రక్తం మరిగిపోయింది. ప్రియాంక థూ అనేంత తప్పు మా అన్నయ్య ఏం చేశాడు. శోభా కూడా నోరేసుకుపడిపోయింది. వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడినా అన్నయ్య కూల్ గా సమాధానం చెప్పాడు. ప్రియాంక, శోభా మొదటి నుండి యాటిట్యూడ్ చూపిస్తున్నారు… అంటూ ఫైర్ అయ్యింది.