Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi: అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ లో సగ భాగం వారికే...

Anil Ravipudi: అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ లో సగ భాగం వారికే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళు చేసే సినిమాలతో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదిస్తుంటారు. అనిల్ రావిపూడి సైతం రికార్డులు క్రియేట్ చేయగలిగే సినిమాలను చేశాడు. ఆయన చేసిన సినిమాలన్ని సూపర్ సక్సెస్ సాధించడంతో ఇప్పుడు చేయబోతున్న సినిమా కోసమే ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే అనిల్ రావిపూడి అందుకునే రెమ్యూనరేషన్ లో చాలా భాగం టీం కి ఇస్తారట. ముందే తను ఒక ప్యాకేజ్ రూపంలో మాట్లాడుకొని తన టీం కి సంబంధించిన డబ్బులను కూడా తనే దగ్గర ఉండి మరి ఇచ్చేస్తూ ఉంటాడట.

తన దగ్గర చాలామంది రైటర్లు ఉంటారు. అలాగే డైరెక్షన్ టీమ్ లో కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆయన చాలా తక్కువ టైంలో సినిమా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఎక్కువ మందిని పెట్టుకొని వీలైనంత తొందరగా పనిని కంప్లీట్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. దానికోసమే ఆయనకు వచ్చే డబ్బుల నుంచి కొంత డబ్బులను తన టీమ్ కి చెల్లిస్తూ ఉంటారట.

ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం తను సక్సెస్ లో ఉన్నాడు. కాబట్టి తన దగ్గరికి చాలా మంది ప్రొడ్యూసర్లు వచ్చి సినిమా చేద్దామని చెప్తున్నారు. ఆయన చాలావరకు మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కాబట్టి ఏదేమైనా కూడా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పడింది. కాబట్టి దానిని కాపాడుకుంటూ రాబోయే సినిమాలతో గొప్ప విజయాలను ఎలా సాధించాలి అనే ధోరణిలోనే అతను ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఆయన అనుకుంటున్నట్లుగా సినిమా ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగలుగుతాడా? తద్వారా వరుస విజయాలను సాధిస్తూ రాజమౌళి తర్వాత అంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు అంటూ రాబోయే రోజుల్లో హిట్స్ కొట్టి తనను తాను ప్రూవ్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version