Nagarjuna: గత కొన్ని సంవత్సరాల నుంచి నాగార్జున చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అవుతున్నా కూడా ఆయన సంతోషంగా లేడు. ఎందుకంటే తన చిన్న కొడుకైన అఖిల్ కి ఒక్క సక్సెస్ కూడా రావడం లేదని ఆహా తీవ్రమైన బాధతో ఉండేవాడు. కానీ అఖిల్ రీసెంట్ గా లెనిన్ సినిమాతో సక్సెస్ ని అందుకున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఆయన మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఇక దాంతో నాగార్జున తన కొడుకు ఎలాగైనా సరే స్టార్ హీరో అవుతాడనే ఒక నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు చేయబోయే సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే అఖిల్ ఆచితూచి మరి తన తదుపరి సినిమా కి కమిట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కథ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దని నాగార్జున అఖిల్ కి చెప్పాడు. అలాగే నాగార్జున సైతం అఖిల్ చేయబోయే సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ లను వింటూ వాటన్నింటిని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు ఆడకపోయినా కూడా తన కొడుకుల సినిమాలు ఆడుతుంటే ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘కింగ్ 100’ సినిమా సైతం తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవ్వనున్న నేపథ్యంలో ఆ సినిమాతో సైతం భారీ విజయాన్ని అందుకుంటాననే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు…
నిజానికి వాళ్ళందరిని స్టార్ హీరోలుగా మార్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.. వారసులను సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మొదటి సినిమాతోనే సక్సెస్ఫుల్ హీరోగా మార్చే ప్రయత్నం చేయాలి.
ఒకవేళ మొదటి స్టెప్ కనక సరిగ్గా పడకపోతే మాత్రం ఆ హీరోలు స్టార్ హీరోలయ్యే అవకాశాలైతే లేకుండా పోతాయి. ఈ విషయంలో చిరంజీవి చాలా కేర్ఫుల్ గా ఉన్నాడు. అందుకే తన కొడుకైన రామ్ చరణ్ ని టాప్ హీరోగా మార్చడంలో ఆయన సక్సెస్ అయ్యాడు…
