https://oktelugu.com/

TTD: కొండ దిగుతున్న టీటీడీ నిధులు..

దేశంలో ఏ దేవాలయం నుంచి వచ్చిన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా ఇతర అవసరాలకు ఖర్చు చేయడం లేదు. అయితే భక్తుల నుంచి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే టీటీడీ నుంచి మాత్రం ఒక్క శాతం నిధులు పేరు చెప్పి కోట్లాది రూపాయలు పక్కదారి పట్టిస్తుండడం మాత్రం విమర్శలకు దారి తీస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : October 19, 2023 5:43 pm
    TTD

    TTD

    Follow us on

    TTD: ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశంలో ఏపీకి గుర్తింపు వెనుక ఈ దేవస్థానం కీలకం. అయితే ఈ దేవస్థానాన్ని కూడా రాజకీయాలకు వినియోగించుకుంటున్నారు. తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధిలోనే రాజకీయాలు మాట్లాడుతున్నారు. దేవస్థానం సొమ్మును ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలని చూస్తుండటం దారుణం. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ సాహసానికి దిగలేదు. తొలిసారిగా వైసిపి పాలకులు ఈ సాహస నిర్ణయం తీసుకున్నారు. భక్తుల నుంచి విరాళాల రూపంలో వచ్చే ఆదాయంలో ఒక్క శాతాన్ని తిరుపతి అభివృద్ధికి ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయం పై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    దేశంలో ఏ దేవాలయం నుంచి వచ్చిన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా ఇతర అవసరాలకు ఖర్చు చేయడం లేదు. అయితే భక్తుల నుంచి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే టీటీడీ నుంచి మాత్రం ఒక్క శాతం నిధులు పేరు చెప్పి కోట్లాది రూపాయలు పక్కదారి పట్టిస్తుండడం మాత్రం విమర్శలకు దారి తీస్తోంది. పాలకవర్గం ఉన్నఫలంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనక రాజకీయ కోణం ఉంది. రాజకీయ ప్రయోజనం దాగి ఉంది. భక్తుల వసతుల కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్న పాలకవర్గం.. తిరుపతి అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా నిధులు మళ్లించడానికి కారణం భూమన కరుణాకర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన తిరుపతి ఎమ్మెల్యే. ఇటీవల టీటీడీ చైర్మన్గా నియమితులయ్యారు. రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాదు.. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడికి లైన్ క్లియర్ ఇచ్చారు. ఆయన గెలుపొందడానికే టీటీడీ నిధులు ఒక్క శాతం కేటాయింపులు అన్న ప్రచారం జరుగుతోంది.

    కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ సర్కార్ తిరుపతి అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించడం లేదు. ఎక్కడికక్కడే పనులు ఆగిపోవడంతో ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే శ్రీవారి నిధులతో కొన్ని పనులు చేయించి.. తన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆగ్రహం తగలకుండా చేయడానికి కరుణాకర్ రెడ్డి ఈ ప్లాన్ చేశారు. భూమన కుమారుడు రాజకీయ లైఫ్ కోసమే టీటీడీ నిధులు వినియోగిస్తున్నారు అన్నమాట.

    వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ధార్మిక కేంద్రాన్ని.. వ్యాపార కేంద్రంగా మార్చేసింది. ఆధ్యాత్మికవేత్తలు, భక్తులకు సేవలు అందించే వారితో కాకుండా.. తమకు పనికొచ్చిన, భవిష్యత్తులో పనికొస్తారని భావిస్తున్న వారిని పాలకవర్గంలోకి తీసుకున్నారు. అందుకే ఇప్పుడు టీటీడీ నిధులు కొండ దిగువకు వెళ్తున్నాయి. తొలుత తిరుపతి, తరువాత రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు అన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంలో బిజెపి నేతలు కాస్త ముందంజలో ఉన్నారు. ప్రభుత్వ చర్యలను ముందే ఊహించారు. 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ ఏపీ సర్కార్.. తరువాత చూపు టీటీడీ పైనేనని ముందే అనుమానించారు. హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. అధినాయకత్వం సీరియస్గా తీసుకుంటే ఇది అత్యంత అవినీతికరమైన కేసే.