Pooja Hegde: ఈమధ్య కాలం లో పూజ హెగ్డే ఇస్తున్న పలు ఇంటర్వ్యూస్ తీవ్రమైన వివాదాలకు దారి తీస్తున్నాయి. సౌత్ ఇండస్ట్రీ పై ఆమె ఇప్పటికే పలు చులకన కరమైన కామెంట్స్ చేసింది. అక్కడి దర్శకులకు అందాలను ఆరబోయడం తప్ప, నటనని బయటకు తీసే అలవాటు లేదంటూ నోరు జారింది. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఏకంగా ఆమె ప్రభాస్ పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వీళ్లిద్దరు కలిసి గతం లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రం లో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అప్పటి వరకు వరుస హిట్స్ తో దూసుకుపోయిన పూజ హెగ్డే కి మొట్టమొదటి డిజాస్టర్ నమోదైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె హీరోయిన్ గా చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ అయ్యింది.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ‘రాధేశ్యామ్ షూటింగ్ సమయం లో ప్రభాస్ పెట్టిన ఫుడ్ ని ఎప్పటికీ మర్చిపోలేను , చాలా రుచికరంగా ఉండేవి’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత యాంకర్ పూజ హెగ్డే ని మరో ప్రశ్న అడుగుతూ ‘ఒకవేళ ప్రభాస్ నుండి ఏమైనా దొంగలించాలని అనుకుంటే , మీరేమి దొంగిలిస్తారు’ అని అడుగుతారు. అందుకు పూజ హెగ్డే సమాధానం చెప్తూ ‘అలాంటి అవకాశం వస్తే నేను ప్రభాస్ వంటమనిషిని దొంగిలిస్తాను. ఆయన నుండి అదొక్కటే దొంగలించగలం. అంతకు మించి ఆయన నుండి దొంగలించదగినవి ఏమి లేవు’ అంటూ చెప్పుకొచ్చింది పూజ హెగ్డే. అంటే దీని అర్థం ఏంటి?, ప్రభాస్ వద్ద దొంగాటానికి అర్హమైన విలువైన గుణాలు ఏమి లేవా?, ఆయన స్వభావాన్ని అందరూ ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు. దాన్ని దొంగతనం చెయ్యాలి అనుకోవచ్చుగా?.
ఎందుకు ‘అతనికి దగ్గర దొంగలించడానికి ఏమి లేవు?’ అనే మాట అనడం. ఇది ఆయన్ని అవమానించినట్టు కాదా? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ , ఫ్యాన్స్ పూజా హెగ్డే ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. రాధే శ్యామ్ షూట్ సెట్స్ లో ప్రభాస్ , పూజ హెగ్డే మధ్య చిన్న గొడవ జరిగింది అంటూ అప్పట్లో ఇండస్ట్రీ లో రూమర్స్ ప్రచారం అయ్యాయి. బహుశా అది నిజమేనేమో , అందుకే పూజా హెగ్డే ఈ విధంగా మాట్లాడి ఉంటుందని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. ఇకపోతే పూజ హెగ్డే రీసెంట్ గా హీరోయిన్ గా నటించిన ‘జన నాయగన్ ‘ చిత్రం ఈ నెల 23 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ఆమె ‘కాంచన 4’ లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది.
