Bheemla Nayak: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భీమ్లానాయక్. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస అప్డేట్స్తో అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పుతోంది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ప్రోమో, పోస్టర్స్, సాంగ్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఇటీవలే విడుదలైన లాలా భీమ్లా లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. విడుదలైన 24 గంటల్లోనే రికార్డుల మోత మోగించింది. గడిచిన 24 గంటల్లో యూట్యూబ్‌లో 10.20 మిలియన్ వ్యూస్‌కు చేరుకుంది. దీంతో ఆల్‌టైమ్ టాప్‌లో దూసుకుపోతోంది. అదే విధంగా 658కే పైగా లైక్స్‌తో ఆల్‌టైమ్ సెకెండ్లో నిలిచింది. మొత్తానికి ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోందని అర్థమైంది.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నిత్యా మీనన్ పవన్ సరసన కనిపించనుండగా.. రానాకు జోడీగా సంయుక్త మేనన్ నటిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండటం విశేషం. తమన్ సంగీతం అందిస్తున్నారు. మరో విశేషమేంటంటే.. లాలా భీమ్లా సాంగ్‌కు రచనలు అందించింది త్రివిక్రమ్. నవంబరు 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. పాటలోనూ తన ప్రాసను వదలకుండా.. వేరే లెవెల్ లిరిక్స్‌ను అందించి.. అభిమానుల్లో జోష్‌ను పెంచారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.