Balayya: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ వేదికగా మొదలైన అన్‌స్టాపబుల్ విక్ ఎన్బీకే టాక్ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షోలో తొలి ఎపిస్డోకు మంచు ఫ్యామిలీతో బాలయ్య సందడి చేశారు. ఎంతో ఎనర్జిటిక్‌గా షోను ప్రారంభించి ఆసక్తికర ప్రశ్నలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో షోను రసవత్తరంగా మార్చారు. మాటలు, ఆటలతో బాలయ్య హంగామా షో మొత్తానికి పండగవాతారణాన్ని తెచ్చాయి. ఇక తర్వాత ఎపిసోడ్ ఎవరితో ఉండనుందో అనుకుంటూ ఉండగా.. తాజా ట్వీట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది ఆహా టీమ్. తర్వాత ఎపిసోడ్లో నేచురల్ స్చార్ నాని సందడి చేసేందుకు సిద్ధమైనట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది.

ఈ క్రమంలోనే నానితో బాలయ్య నెట్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఆహా సంస్థ విడుదల చేసింది. మనలో ఒకడు.. సెఫ్స్ నేమ్‌కి సర్ నేమ్.. నేచురల్ స్టార్ నాని మన తర్వాత గెస్ట్ అని తెలుపుతూ.. ఈ ఎపిసోడ్ ప్రోమోను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ప్రోమో కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో నాని బాలయ్య ఫ్యాన్‌గా కనిపించి అలరించారు. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి ఒకే స్టేజ్‌పై సందడి చేయనుండటంతో ఇరు స్టార్ అభిమానులకు సంతోషం ఉరకలేస్తోంది. మరి నానితో బాలయ్య పరస్పర సంభాషణ ఎలా ఉందో తెలియాలంటే నెక్స్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే. మరోవైపు, నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.